గోపీచంద్‌ – మారుతి సినిమా కొత్త అప్‌డేట్‌

వైవిధ్యమైన టీజర్‌తో గోపీచంద్‌ – మారుతి కొత్త సినిమా ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. కోర్టులో తీర్పు నేపథ్యంలో రన్‌ అయిన టీజర్‌లో సినిమా మీద ఇప్పటివరకు వచ్చిన పుకార్లకు తెరదించేలా జడ్జి పాత్రతో తీర్పు చెప్పించారు. ఈ కొత్త ఆలోచనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇదేదో విషయం ఉన్న సినిమానే అనుకుంటూ… అంచనాలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా మీద కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో మారుతి మరోసారి ‘తండ్రీ – కొడుకుల’ సెంటిమెంట్‌ను చూపించబోతున్నాడట.

సినిమా టీజర్‌ ప్రకారం చూస్తే… ఇది కోర్టు నేపథ్యంలో సాగబోతున్న సినిమా అని హింట్‌ ఇచ్చినట్లు అయ్యింది. ఆ లెక్కన హీరో అదేనండి గోపీచంద్‌ లాయర్‌గా కనిపిస్తాడనేది సుస్పష్టం. ఇప్పుడు తండ్రీకొడుకుల సినిమా అంటున్నారు కాబట్టి తండ్రి పాత్రధారి కూడా కోర్టులో ఉంటాడట. అయితే జడ్జినా అంటే టీజర్‌లో రావు రమేష్‌ మాటలు వినిపించాయి. కాబట్టి తండ్రి కూడా లాయరే అవ్వొచ్చు అంటున్నారు. అంటే లాయర్‌లైన తండ్రీకొడుకుల మధ్య వాదోపవాదేలే ఈ సినిమా అన్నమాట. అయితే ఇవన్నీ పుకార్లే. అసలు మారుతి మైండ్‌లో ఏం రన్‌ అవుతుందో మరి.

అయితే ఇక్కడో విషయం ఉంది. ఇందులో గోపీచంద్‌ తండ్రిగా సత్యరాజ్‌ నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ‘శంఖం’లో తండ్రీకొడుకులు కనిపించి అలరించారు. అంటే ఇది రెండోసారి అన్నమాట. అయితే ఇందులో ఆ సినిమాలాగా ప్రేమాభిమానులు కాకుండా సంఘర్షణ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మారుతి మార్కు వినోదం కూడా ఉండబోతోందట. చూద్దాం ఇంకా ఏయే విషయాలు బయటకు వస్తాయో.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus