సంక్రాంతికి స్టార్ హీరోల సందడి, ఆ తర్వాత నెల కూడా అదే జోరు కొనసాగుతుంది అంటూ… సంబరపడి వారాలు గడవలేదు. మొత్తం పరిస్థితి మారిపోయింది. కరోనా ‘ఒమిక్రాన్’ రూపం దాల్చి టాలీవుడ్‌కి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ కోసం వెనక్కి వెళ్లిన ‘భీమ్లా నాయక్’ తిరిగి వెనక్కి వచ్చేలా లేదు. ఇక ఆ రెండు పాన్ ఇండియా సినిమాలు ఎందుకు వెనక్కి వెళ్లాయో తెలుసు. దీంతో పొంగల్ ఫైట్‌లో ‘బంగార్రాజు’ రూపంలో ఒకే పెద్ద సినిమా ఉంది. ఇదంతా గతం. ఇప్పుడు నెక్స్ట్ వాయిదా ఏ సినిమా అనేదే ప్రశ్న.
అవును, టాలీవుడ్‌లో మరో పెద్ద సినిమా వాయిదాకు సిద్ధమైందని సమాచారం. అదే మెగా హీరోల ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్‌తో కొరటాల శివ తీసిన ‘ఆచార్య’నే. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే కరోనా పరిస్థితులు, ఏపీలో టికెట్ ధరల విషయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను వాయిదా వేస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న ధరలు, పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల చేస్తే నిర్మాతకు కచ్చితంగా నష్టాలే అంటున్నారు పరిశీలకులు.
రానున్న రెండు, మూడు వారాల్లో కరోనా పరిస్థితులు ఇంకా ఇబ్బందికర స్థాయికి చేరుకుంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సినిమాను విడుదల చేయడం పెద్ద రిస్కే. దీనికితోడు ప్రభుత్వాలు కరోనా ఆంక్షల విధించే పనిలో ఉన్నారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నియమం మళ్లీ తీసుకొస్తారని కూడా అంటున్నారు. నైట్ కర్ఫ్యూ పెడతారనీ సమాచారం వస్తోంది. ఒకవేళ ఇదంతా జరిగితే… సినిమాల వసూళ్లు అమాంతం పడిపోతాయి. కాబట్టి ఈ టైమ్‌లో సినిమా అందులోనూ పెద్ద హీరో సినిమా అంటే కష్టమే.
దీంతో ‘ఆచార్య’ కూడా వాయిదా బాటలోకి వెళ్తాడని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే… నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టమైతే తప్పదు. దానికితోడు నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’కి దారి ఇచ్చాకనే ‘ఆచార్య’ కోసం డేట్ ఓకే చేయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాయిదా పడితే సమ్మర్ తర్వాతే వస్తుంది ‘ఆచార్య’.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!