సగానికి సగం నష్టపోయిన ‘ఎన్జీకే’ బయ్యర్లు..!

సూర్య హీరోగా సెల్వరాఘవన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘ఎన్జీకే’ . సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31 న విడుదలైంది. పొలిటికల్ డ్రామా కథాంశంతో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.20 కోట్లు
సీడెడ్ – 0.77 కోట్లు
వైజాగ్ – 0.75 కోట్లు


గుంటూరు – 0.49 కోట్లు
ఈస్ట్ – 0.35 కోట్లు
వెస్ట్ – 0.29 కోట్లు


కృష్ణా – 0.45 కోట్లు
నెల్లూరు – 0.23 కోట్లు
—————————————
టోటల్ – 4.5 కోట్లు(షేర్)
————————————–

‘ఎన్జీకే’ చిత్రానికి 9 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి కేవలం 4.5కోట్ల షేర్ మాత్రమే రావడం గమనార్హం. అంటే ఈ చిత్రానికి 50 శాతం నష్టాలు వచ్చాయి. సూర్య గత చిత్రాలు ‘గ్యాంగ్’ ’24’ బాగా కలెక్ట్ చేసాయి. కానీ ఈ చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus