Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఎన్ జి కె ప్రేక్షకులకు ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది: హీరో సూర్య

ఎన్ జి కె ప్రేక్షకులకు ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది: హీరో సూర్య

  • May 29, 2019 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్ జి కె  ప్రేక్షకులకు ఒక  యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది: హీరో సూర్య

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్‌.జి.కె’. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జె.ఆర్.సి ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను హీరో సూర్య ఆవిష్కరించి ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌కి అందించారు. ఈ సందర్భంగా…

ngk-movie-pre-release-event1

నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”హీరో తమిళ హీరో అయినప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. శ్రీరాఘవగారు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా రాధామోహన్‌గారికి ఈ సినిమా మరో పెద్ద సక్సెస్‌గా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ngk-movie-pre-release-event2

సినిమాటోగ్రాఫర్‌ శివకుమార్‌ విజయన్‌ మాట్లాడుతూ – ”ఈసినిమా కోసం యూనిట్‌ అంతా చాలా కష్టపడింది. ఇదొక లాంగ్‌ జర్నీ. సూర్యగారు, శ్రీరాఘవగారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ngk-movie-pre-release-event9

మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె సినిమా అనువాదంలా అనిపించడం లేదు. తెలుగులో పెద్ద హీరో సినిమా వస్తే ఎలా వెయిట్‌ చేస్తుంటారో..సూర్యగారి సినిమా కోసం అలాగే వెయిట్‌ చేస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటన్నాం. రాధామోహన్‌గారి ప్రొడక్షన్‌లో సినిమా అంటే మా సొంత సినిమాలాగానే భావిస్తాం” అన్నారు.

ngk-movie-pre-release-event3

నిర్మాత బాపినీడు మాట్లాడుతూ – ”సూర్య, సాయిపల్లవి, రకుల్‌, శ్రీరాఘవగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

ngk-movie-pre-release-event5

హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ – ”హైదరాబాద్‌కు వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్‌ ఉంటుంది. నాకు చిన్నప్పట్నుంచి సూర్య సార్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఇప్పుడు సినిమా చేయడం కలలాగా ఉంది. నాకొక మూమెంట్‌. ఆయన సెట్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు షూటింగ్‌ సమయంలో ఎంతగానో సపోర్ట్‌ అందించారు. శ్రీరాఘవగారు ఓ విజనరీతో సినిమా చేస్తారు. ఆయన ప్రతి క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా చూపిస్తారు. ఈ సినిమా నుండి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నాకు సపోర్ట్‌ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌” అన్నారు.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ngk-movie-pre-release-event7

హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ – ” శ్రీ రాఘవ గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నేను స్కూల్‌ అయిపోయిన తర్వాత కన్నడలో ఓ సినిమా చేశాను. అదే 7/జి బృందావన కాలనీ రీమేక్‌. అప్పటి నుండి
శ్రీ రాఘవ సార్‌తో పనిచేయాలని ఉంది. ఈసినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్‌ ఇది. సీరియస్‌ రోల్‌ చేశాను. సినిమా కోసం ఎగ్జయిటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. సూర్యగారు అమేజింగ్‌, ప్రొఫెషనల్‌ యాక్టర్‌. ఆయనతో పనిచేయడం హ్యాపీ. ఈ సినిమాకు యువన్‌శంకర్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. మే 31న విడుదలవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది” అన్నారు.

ngk-movie-pre-release-event6

రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ”ట్రైలర్‌ అద్భుతంగా ఉంది కదా!. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది. సూర్యగారు సహా ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

ngk-movie-pre-release-event4

శ్రీరాఘవ మాట్లాడుతూ – ”నేను సూర్యగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందరికీ సూర్యగారు గొప్ప నటుడు అని తెలుసు. అయితే ఆయన అంత కంటే గొప్ప మనసున్న మనిషి. ఆయనకు సెల్యూట్‌. ఆయన ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలుసు. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ ఇద్దరూ మంచి నటీమణులు. యువన్‌శంకర్‌ రాజా సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌” అన్నారు.

ngk-movie-pre-release-event6

సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”’ఎన్‌.జి.కె’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభుగారికి థాంక్స్‌. ఇందులో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్‌. ఇంతకు ముందు పెద్ద హిట్స్‌ సాధించిన సూర్య సినిమాలకు ధీటుగా ఉంటుందని భావిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

ngk-movie-pre-release-event8

హీరో సూర్య మాట్లాడుతూ – ”ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు థాంక్స్‌. వారి ఆదరణతో దీన్ని నా సొంత ఇంటిలా భావిస్తాను. నా గత చిత్రం విడుదలై ఏడాదిన్నర సమయం పట్టింది. మీలాగానే నేను కూడా శ్రీరాఘవగారికి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఆయనతో ఈ సినిమా చేశాను. సినిమా చూసే ప్రేక్షకులకు ఇది యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. ఈ సినిమా మా అందరికీ స్పెషల్‌ మూవీ. నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. రకుల్‌, సాయిపల్లవికి థాంక్స్‌. మే 31న ప్రేక్షకులన అంచనాలను అందుకుంటామని భావిస్తున్నాను. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా” అన్నారు. చిత్ర దర్శకుడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Selvaraghavan
  • #Nanda Gopala Krishna (NGK)
  • #NGK Movie
  • #Rakul Preet Singh
  • #Sai Pallavi

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version