The Raja Saab: ది రాజసాబ్: ఆమె భయపెడుతుందట.. కానీ దెయ్యం కాదట!

ప్రభాస్ (Prabhas) నటిస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ రాజసాబ్(The Rajasaab)   సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్‌లో సినిమా పైన క్యూరియాసిటీ పెంచేలా అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ, తన పాత్ర భయపెట్టేలా ఉంటుందని, అయితే అందరూ ఊహించినట్లుగా దెయ్యం క్యారెక్టర్ మాత్రం కాదని చెప్పింది.

The Raja Saab

రాజసాబ్ సినిమా అంతా హర్రర్, కామెడీ, రొమాన్స్ మిక్స్‌తో సాగుతుందని చెప్పిన నిధి, కథలో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయని హింట్ ఇచ్చింది. సెట్స్ గురించి చెబుతూ, “ఇంత అద్భుతమైన వాతావరణంలో పని చేయడం నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్,” అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు గుప్పించింది. సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉన్నా, మాళవిక మోహనన్ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ తర్వాత, ఆమె పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది.

ఆమె లుక్‌ను ఇప్పటివరకు బయటకు రానీయలేదు. “రాజసాబ్‌ (The Raja Saab) టీమ్, ప్రేక్షకులకు ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ అందించాలని భావించింది,” అంటూ ఆమె చెప్పిన మాటలు మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇక రాజసాబ్ హిందీ మార్కెట్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. భూషణ్ కుమార్ ఈ సినిమాను బాలీవుడ్‌లో ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో (Hari Hara Veera Mallu)  కూడా నటిస్తుండటం విశేషం.

అదే విధంగా, తమిళ స్టార్ హీరో సూర్యతో ఆమె కొత్త సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి రాజసాబ్ టీమ్‌పై ఉంది. సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరి నిధి పాత్ర సినిమాలో ఎంత కీలకంగా ఉంటుందో, ఆమె లుక్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus