నాగచైతన్య సరసన నిధి అగర్వాల్!

సూపర్ హిట్ అవుతుందనుకొన్న “యుద్ధం శరణం” సోషల్ మీడియా వరకూ పర్లేదు అనిపించుకొన్నా.. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కాదు కదా కనీస స్థాయి రిటర్స్ తీసుకురావడంలో కూడా దారుణంగా విఫలమవ్వడంతో.. తన తదుపరి చిత్రమైన “సవ్యసాచి”పై స్పెషల్ కేర్ తీసుకొంటున్నాడు నాగచైతన్య. తనకు “ప్రేమమ్” లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన చందూ మొండేటిని దర్శకుడిగా ఎన్నుకొన్న నాగచైతన్య హీరోయిన్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని మొదట పూజా హెగ్డేను సినిమాలో నటింపజేద్దామనుకొన్నప్పటికీ.. ఆవిడ డేట్స్ తోపాటు రెమ్యూనరేషన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె స్థానంలో మరో బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎంపిక చేసుకొన్నాడు నాగచైతన్య.

ఈ ఏడాదే బాలీవుడ్ లో “మున్నా మైఖేల్”తో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన అందాల ఆరబోతతో యువతను విశేషంగా ఆకట్టుకొంది. ఆ క్రేజ్ తోనే ఈ బెంగుళూరు బ్యూటీ “సవ్యసాచి”లో నటించే అవకాశం దక్కించుకొంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus