పెళ్లి త‌ర్వాత అలా కుద‌ర‌దు కదా.. అందుకే ఇప్పుడు వ‌రుస‌గా కానిచ్చేస్తుంది..!

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక పెళ్లి డిసెంబ‌ర్ 9న జ‌ర‌గ‌బోతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రాజ‌స్థాన్‌‌లోని ఉద‌య్‌పూర్ ఉద‌య్ విలాస్‌ని ఈ మెగా పెళ్లి కోసం సిద్ధం చేస్తున్నారు. దీంతో ఇటీవల అక్క‌డికి వెళ్లిన వెడ్డింగ్ ప్లాన్ చేసే బృందం చక చ‌కా అన్ని హంగుల‌తో పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేపే ప‌నిలో ఉన్నారు. ఇక తాజాగా నిహారిక‌-చైత‌న్య‌ల పెళ్లి ఆహ్వాన పత్రిక మెగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అవుతోంది.

ఇక ఆ విష‌యం ప‌క్క‌న పెడితే పెళ్లి టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డ‌తో వ‌రుస‌గా పార్టీల్లో మునిగితేలుతుంది. పెళ్లి త‌ర్వాత బ్యాచిల‌ర్ లైఫ్‌కి ఎండ్ కార్డు ప‌డుతుంది కాబ‌ట్టి, ఇలాంటి రోజులు మ‌ళ్ళీ రావ‌ని బంధువులు, మిత్రులకు పార్టీలు ఇస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది మెగా డాట‌ర్. ఇటీవ‌ల గోవాలో బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చిన నిహారిక‌, ఆ త‌ర్వాత మెగా ఫ్యామిలీలోని యంగ్ జ‌న‌రేష‌న్‌కి ప్ర‌త్యేక‌పార్టీ ఇచ్చింది. గ్రాండ్‌గా ఇచ్చిన పార్టీలో చిరంజీవి డాట‌ర్స్ సుష్మిత, శ్రీ‌జ‌తో పాటు మెగా స‌న్నిహిత బ‌ధువుల పిల్లలు ఆ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మ‌రో గ్యాంగ్‌కి బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చింది నిహారిక‌.

ఈసారి కాబోయే భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి ఇచ్చిన పార్టీలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు, కాల‌ భైరవతో పాటు మ‌రి కొంత మంది ఫ్రెండ్స్‌కి బ్యాచిల‌ర్ పార్టీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియ‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌పోతే నిహారిక పెళ్లి కోసం మెగా హీరోలంతా సినిమాల‌కు బ్రేక్ ఉద‌య్‌పూర్‌లో జ‌రిగే డెస్టినేష‌న్ వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ దాదాపుగా హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. ఓ వైపు రాజకీయాలు, మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న బాబాయ్ ప‌వ‌న్ కూడా రెండు రోజుల ముందే వ‌స్తాన‌ని హామీ ఇచ్చాడ‌ట‌. దీంతో మెగా హీరోలంతా నిహారిక పెళ్లి కోసం ఒకే వేదిక‌పై చూసేందుకు మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

నిహారిక కొణిదెల వెడ్డింగ్ కార్డు

1

2

3

నిహారిక-చైతన్య ఎంగేజ్మెంట్ ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus