మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో బుల్లితెర పై పలు షోలకు మెంటర్ గా వ్యవహరించి మరోపక్క పలు షార్ట్ ఫిలిమ్స్ ను నిర్మించి, ఓ టాక్ షోని కూడా హోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అటు తర్వాత ‘ఒక మనసు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ మూవీ బాగానే ఉంటుంది కానీ ట్రాజెడీ ఎండింగ్ కారణంగా సినిమా నిరాశపరిచింది అని ఆడియన్స్ పెదవి విరిచారు.
అటు తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి సినిమాల్లో కూడా నటించింది అవి కూడా ఈమెకు సక్సెస్ ను అందించలేదు. తమిళంలో ఓ సినిమా చేసింది. ‘సైరా’ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర పోషించింది. అది కూడా ఈమెకు కలిసిరాలేదు. అటు తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్లలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కోవిడ్ రావడం, ఈమెకు పెళ్లి జరగడం జరిగింది. పెళ్లి తర్వాత నిహారిక ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తుంది.
నిత్యం నిహారిక (Niharika) గురించి ఏదో ఒక న్యూస్ రావడం అది వైరల్ అవ్వడం.. మనం తరచూ చూస్తూనే వస్తున్నాం. ఇదిలా ఉండగా.. నిహారిక ఇటీవల గోవా టూర్ కు వెళ్ళింది. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అయిన నిహారిక ఎన్.ఎం తో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుంది నిహారిక కొణిదెల. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :