Niharika: నీహారిక లాక్ డౌన్ కష్టాలు!

  • May 22, 2021 / 04:41 PM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్నాయి. కరోనాను అరికట్టడానికి ఇంటిపట్టునే ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. షూటింగ్ లన్నీ క్యాన్సిల్ అవ్వడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారంతా ఏదొక వ్యాపకంతో సమయాన్ని గడుపుతున్నారు.

కొందరు ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతుంటే మరికొందరు సినిమాలు, సిరీస్ లు చూస్తున్నారు. మరికొందరు కొత్త భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా చెఫ్ అవతరమెత్తి వంటలు చేసేస్తున్నారు. మెగాడాటర్ నీహారిక కూడా ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ లాక్ డౌన్ ను చాలా బోరింగ్ గా ఫీల్ అవుతుందట. ఈ మేరకు ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సమయం దొరికితే అందానికి మెరుగులు దిద్దుతుంటారు ఆడవాళ్లు.

నీహారిక కూడా అదే చేస్తుంది. అందంగా రెడీ అవుతూ.. ఆ తరువాత సెల్ఫీలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అంతేకాదు.. తన పెట్ బజ్ తో కలిసి ఏం చేయాలో తెలియక.. గోడలను చూస్తూ కాలం గడుపుతుంది. మొత్తానికి నీహారిక ఈ లాక్ డౌన్ కారణంగా తెగ కష్టపడిపోతుందనిపిస్తుంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus