Niharika: చిన్న చిన్న విషయాలే సంతోషాన్ని కలిగిస్తున్నాయి!

మెగా డాటర్ నిహారిక గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా నిహారిక తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ నిహారిక కానీ తన ఫ్యామిలీ కానీ ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈమె గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఈ విషయాలన్నింటిని నిహారిక ఏమాత్రం పట్టించుకోకుండా తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉండిపోయారని తెలుస్తుంది.

ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారడమే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక నిహారిక తాజాగా డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సిరీస్ మంచి స్పందన అందుకోవడంతో ఈమె ఈ సిరీస్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక తన స్నేహితులతో కలిసి బాలీ దీవుల వెకేషన్ కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అక్కడ ఈమె తన స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతున్నారు.

ఇలా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను (Niharika) నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రకృతిలో లీనం అవుతు దిగినటువంటి ఒక ఫోటోని నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన అనుభవాలను తనకు కలుగుతున్న అనుభూతి గురించి ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నిహారిక ఈ ఫోటోని షేర్ చేస్తూ… ఈ ప్రదేశం తనని తాను కొత్తగా మార్చుకోవడానికి ఎంతో దోహద పడిందని తెలిపారు.

ఈ బాలీ దీవులు తనకు ఒక తల్లిలా గురువులా తనకు ఎన్నో విషయాలను తెలియచేశాయని అందుకు ఈమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఒకప్పుడు తనను ఎన్నోవిషయాలు బాధపెట్టాయని ఆ బాధలను తాను మాటలలో కూడా వర్ణించలేనని తెలిపారు. అయితే ప్రస్తుతం తాను చేయాలనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతున్నాయని తెలియజేశారు. చిన్నచిన్న విషయాలు అయినా తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నిహారిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus