Niharika: పుష్ప నుంచి ఆర్ఆర్ఆర్ వరకు సిగ్నేచర్ స్టెప్స్ తో అదరగొట్టిన నిహారిక!

మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నిహారిక మొదట బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకొని అనంతరం హీరోయిన్ గా అవకాశాలు అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. సినిమాలకు దూరమైనటువంటి నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు.

ఇకపోతే నిహారిక పెళ్లయిన తర్వాత కూడా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇలా కెరియర్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా నిహారిక ఎన్నో ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కొరియోగ్రాఫర్ మృణాళిని కిరణ్ తో కలిసి ప్రస్తుతం విడుదలైన సినిమాలలో పలు పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయే డాన్స్ చేశారు.

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో రారా సామి, ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు, బుల్లెట్ బండి, బీస్ట్ సినిమాలో పాటకు, రాను రాను అంటుందో చిన్నదో అనే పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయి పర్ఫామెన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మొదటిసారిగా టాలెంటెడ్ మృణాళి కిరణ్ తో డాన్స్ చేస్తున్నాను అని చెప్పడమే కాకుండా ఈ వీడియో షూట్ ఫుల్ ఫన్నీగా ఉంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus