Niharika: హాట్ టాపిక్ గా మారిన మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ ఫోటోలు..

మెగా ఫ్యామిలీ నుండీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. నాగబాబు కూతురు అయిన నిహారిక కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తరువాత బుల్లితెర పై కూడా పలు షోలలో పాల్గొంది. అటు తరువాత మెల్లగా సినిమాల వైపు మళ్ళింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది.ఆ చిత్రంలో నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ అటు తరువాత ఈమె నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అవ్వడంతో ఈమె డీలా పడిపోయింది.

తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రంలో ఈమె నటించినా అది చాలా చిన్న పాత్ర. కనీసం అందులో నిహారికకు డైలాగులు కూడా ఉండవు. జూనియర్ ఆర్టిస్ట్ చెయ్యాల్సిన పాత్ర అది.. కానీ పెదనాన్న సినిమాలో కనిపించాలనే కోరిక కొద్దీ చేసింది. ఇక గతేడాది గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు అయిన వెంకట చైతన్యను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుకోండి. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తోంది.

తన భర్త చైతన్యతో దిగిన ఫోటోలను ఇందులో అప్లోడ్ చేస్తుంటుంది ఈ బ్యూటీ.అయితే తాజాగా ఈమె ఓ ఫోటో షూట్లో కూడా పాల్గొంది. రెడ్ కలర్ డ్రెస్ లో నిహారిక ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక ఫేస్లో ఏదో ఛేంజ్ కనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈమె ఏమైనా సర్జరీ చేయించుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్ళైన తరువాత ఇలాంటి మార్పులు మామూలే అని మరికొంత మంది జవాబులు ఇస్తుండడం విశేషం.

1

2

3

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus