Niharika: చేయి చూపించమన్న నేటిజన్.. నిహారికను రియాక్షన్ ఇదే?

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినీ కెరియర్ పై పూర్తి ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా వ్యవహరించారు. అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోవడంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే వైవాహిక జీవితంలో కూడా ఈమె సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

పెళ్లి చేసుకున్నటువంటి నిహారిక తన భర్తతో వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఆయనకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె ఒకవైపు నిర్మాతగా మారి ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా మరోవైపు హీరోయిన్ గా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

ఇకపోతే తాజాగా ఈమె మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నటువంటి వాట్ ది ఫిష్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవల నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ నిహారిక మీ అర చేయి చూపించండి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఏంటి బాబు నా జాతకం కనుక చెబుతావా ఏంది అంటూ సమాధానం ఇవ్వడమే కాకుండా మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియకపోతేనే హ్యాపీగా గడపవచ్చు అంటూ ఈమె ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus