Priyadarshi: అస్సలు ఊహించని కాంబో ఇది.!

ప్రియదర్శి (Priyadarshi)  టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా ఉంటూ వచ్చాడు. అయితే కొన్నాళ్లుగా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మల్లేశం (Mallesham) , బలగం (Balagam) వంటి బ్లాక్ బస్టర్లు అందుకొన్నాడు. అయితే ఇటీవల వచ్చిన డార్లింగ్ సినిమా నిరాశపరిచింది.అయినప్పటికీ అతని రేంజ్ పడిపోలేదు. పెద్ద సంస్థల్లో ఇతను సినిమాలు చేస్తున్నాడు.ఇదే క్రమంలో గీతా ఆర్ట్స్. కి చెందిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్లో ప్రియదర్శి ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే దీనికి దర్శకుడు ఎవరు? వంటి వివరాలు బయటకి రాలేదు.

కానీ గీతా ఆర్ట్స్ సంస్థ నుండీ ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే రూపొందుతాయి. ప్రియదర్శితో చేయబోయే సినిమా కూడా అలాంటిదే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నీహారిక ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. అదేమిటి.. ‘నీహారిక ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటుంది కదా’ అని అంతా అనుకోవచ్చు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసేది మెగా డాటర్ నీహారిక కాదు.

ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ నీహారిక ఎన్.ఎమ్. కేజీఎఫ్ 2 రిలీజ్ టైమ్లో యష్ , మేజర్ టైమ్లో అడివి శేష్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో ఈమె ప్రమోషన్లలో పాల్గొంది. ఇక ప్రియదర్శి సినిమాతో ఈమె హీరోయిన్ గా కూడా మారుతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెష్ చెబుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ కూడా వైరల్ అవుతుంది. మరి హీరోయిన్ గా నీహారిక ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus