Niharika: కాలమే మందు అంటూ బాధను బయటపెట్టిన నిహారిక!

  • May 3, 2023 / 11:48 AM IST

నిహారిక కొణిదల పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఈమె అడుగుపెట్టారు. ఇలా కెరీర్ మొదట్లో యాంకర్ గా కొనసాగిన నిహారిక అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరోయిన్ నిహారిక అని చెప్పాలి అయితే హీరోయిన్ గా నిహారిక అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో నిహారిక సక్సెస్ కాకపోవడంతో ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

అయితే ఈమె వివాహం తర్వాత తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ గతి కొద్ది రోజులుగా తన భర్త వెంకట చైతన్యతో తనకు మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.ఇందుకు అనుగుణంగానే ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం ఫోటోలను డిలీట్ చేసుకోవడం జరిగింది. నిహారిక వ్యక్తిగత విషయాల గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈ విషయాల గురించి మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు అయితే నిహారిక మాత్రం ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టి పూర్తిగా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ పెట్టారు.

ఈ క్రమంలోని హైదరాబాదులో తాజాగా ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి సినిమాలు వెబ్ సిరీస్ కథలు వినే పనిలో బిజీ అయ్యారు. ఇలా నిహారిక తన వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించి ఈమె నిర్మాణరంగంలో బిజీ అవుతున్నారు. అలాగే మరోవైపు భారీ స్థాయిలో వర్క్ అవుట్ చేస్తూ ఫిట్నెస్ కోసం కూడా కష్టపడుతున్నారు.

ఇలా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని (Niharika) నిహారిక షేర్ చేస్తూ కొన్ని హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ టిప్స్ కూడా చేశారు. ఇందులో భాగంగానే మనకు తగిలిన గాయాలకు కాలమే మందు అంటూ ఒక కొటేషన్ చెప్పడంతో నిహారిక మనసు చాలా గాయపడిందని ఆ బాధ నుంచి బయటపడటం కోసమే ఇలా తన వృత్తిపరమైన జీవితంపై ఫోకస్ పెట్టారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈమె చేసే సినిమాలు వెబ్ సిరీస్ లు సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus