Niharika: భీమ్లా వాయిదాపై నిహారిక షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భీమ్లా నాయక్ వాయిదా గురించి తాజాగా నిహారిక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమ్లా నాయక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నిహారిక ఆశాభావం వ్యక్తం చేశారు.

మా బాబాయ్ ఒక సినిమాలో చెప్పిన విధంగా కొన్నిసార్లు రావడం లేట్ అయినా రావడం మత్రం పక్కా అని భీమ్లా నాయక్ గురించి నిహారిక కామెంట్లు చేశారు. సినిమా విడుదల ఆలస్యమైనా బాక్సాఫీస్ లు బద్దలుగొట్టడం పక్కా అని నిహారిక అన్నారు. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి నిహారిక స్పందిస్తూ తనకు తారక్ అన్న చాలా సంవత్సరాల నుంచి తెలుసని పేర్కొన్నారు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతి తన క్లాస్ మేట్ అని నిహారిక ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ మరోస్థాయిలో ఉంటుందని నిహారిక కామెంట్లు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ ను స్పెషల్ గా కలిసి అభినందనలు తెలిపానని నిహారిక చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ట్రైలర్ ను థియేటర్ లో చూసిన సమయంలో ఒళ్లు గగుర్పొడిచిందని నిహారిక అన్నారు. తాను ప్రేక్షకురాలిగా ఈ విషయం చెబుతున్నానే తప్ప చరణ్ సోదరిగా కాదని నిహారిక అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని నిహారిక వెల్లడించారు.

భీమ్లా నాయక్, ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసి ఈ రెండు సినిమాలపై నిహారిక అంచనాలను మరింత పెంచారు. ఎన్టీఆర్ ఎనర్జీ గురించి నిహారిక చెప్పిన మాటలు నెటిజన్లను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉన్నా వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం నిహారిక యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus