Niharika: ఖాళీగా ఉంటే ఆ పని చేస్తాను కానీ.. మీ ట్రాక్ అసలు చూడను!

సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోని ఇప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామాకంపెనీ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి మెగా డాటర్ నిహారిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈమె నిర్మాణంలో వచ్చిన హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఈమె ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

మెగా డాటర్ నిహారిక ఉందంటే అక్కడ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఈమె కూడా తన కెరియర్ ను మల్లెమాల వారి నిర్మాణ సారథ్యంలోని ప్రారంభించారని అందరికీ తెలిసిందే. ఈమె కెరియర్ మొదట్లో ఢీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వివాహమైన తర్వాత ఈమె వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ అందులో నటిస్తూ ఉన్నారు. నిహారిక తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అందరిపై ఎప్పుడు పంచులు వేసే హైపర్ ఆదికి గట్టి కౌంటర్ ఇస్తూ తన నోరు మూయించింది. ఇకపోతే ఇమ్మానియేల్ వేదిక పైకి నడుచుకుంటూ వస్తుండగా వెంటనే మహ ముద్దొచ్చేస్తున్నావోయ్ అనే పాటను ప్లే చేశారు.ఈ పాట ప్లే చేయగానే వెంటనే హైపర్ ఆది వీణ్ణి చూస్తే ఏ యాంగిల్ లో ముద్దొస్తుంది అంటూ కౌంటర్ వేశాడు. అనంతరం ఇమ్మానియేల్ నిహారికతో మాట్లాడుతూ మేడం మీరు నాది, వర్ష లవ్ ట్రాక్ చూస్తారా? అని ప్రశ్నించారు.

ఇలా ఇమ్మానియేల్ అడిగేసరికి నిహారిక సమాధానం చెబుతూ అరే నేను ఖాళీగా ఉంటే రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీలవ్ ట్రాక్ మాత్రం అస్సలు చూడను అంటూ దారుణంగా వేదిక పైన ఇమ్మానుయేల్ పరువు తీసింది.ఇలా నిహారిక ఇమ్మానుయేల్ పై సెటైర్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు వెంటనే హైపర్ ఆది అందుకని వాళ్లు నడిచేది కూడా రైల్వే ట్రాక్ పైనే అంటూ మరోసారి పంచ్ వేసాడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus