Nikhil : రిలీజ్‌ గురించి వారం ఏడ్చేశాను: నిఖిల్‌ కామెంట్స్‌ వైరల్‌

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకపోయినా రాణించొచ్చు, విజయాలు సాధించొచ్చు, ఎంతోమందికి రోల్‌ మోడల్‌గా నిలవొచ్చు అని చెప్పేలా కొంతమంది హీరోలు వస్తూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం అలా వచ్చి ప్రామిసింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిఖిల్‌ సిద్ధార్థ్‌. చిన్న హీరోగా మొదలై, వరుస విజయాలతో యంగ్ స్టార్‌ అనిపించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో నిఖిల్ సినిమాలు తేడా కొడుతున్నాయి. ఎక్కడో సమస్య వచ్చి ఇబ్బందిపడుతున్నాడు. ఇలాంటి సమయంలో కీలక చిత్రంగా వస్తోంది ‘కార్తికేయ 2’.

అయితే ఈ సినిమాకు రిలీజ్‌ కష్టాలు తీరడం లేదు. నిఖిల్‌ కెరీర్‌లో ‘కార్తికేయ’ సినిమాకున్న స్థానం చాలా పెద్దది అని చెప్పొచ్చు. ఆ సినిమాతో నిఖిల్‌ కెరీర్‌ భారీ మలుపు తీసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్‌గానే ఇప్పుడు ‘కార్తికేయ 2’ వస్తోంది. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అంతకుముందు చాలాసార్లు సినిమా వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలించక, థియేటర్ల సమస్యతో ఇలా చాలారకాలుగా సినిమా వాయిదా పడింది.

ఆగస్టు 12 డేట్‌ అనేసరికి పరిశ్రమ నుండి కొంతమంది వాయిదా వేసుకోమని సూచించారట. తన సినిమా గురించి మాట్లాడిన తీరు చూసి ఏకంగా ఏడుపొచ్చేసిందని నిఖిల్‌ చెప్పారు. ఆ మాటల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆగస్టు 12న మా ‘కార్తికేయ 2’ రిలీజ్ అని ప్రకటించిన తర్వాత కొంతమంది ‘సినిమా వాయిదా వేసుకోండి’ అని అన్నారు. అక్టోబరుకి వెళ్లిపోండి, నవంబరుకి వెళ్లిపోండి అని అన్నారు.

ఇప్పుడు రిలీజ్‌ చేస్తే మీకు థియేటర్లు దొరకవు, స్క్రీన్స్‌ అందుబాటులో ఉండవు అని అన్నారు’’ అని నిఖిల్‌ చెప్పారు. చాలా స్ట్రాంగ్‌గా ఉండే నేను ఆ మాటలతో చాలా కుంగిపోయానని, ఓ వారం పాట ఏడ్చేశాను అని నిఖిల్‌ చెప్పారు. మరి అందరివాడు అనిపించుకునే నిఖిల్‌ను ఇంతలా ఇబ్బంది పెట్టిన ఇండస్ట్రీ మనుషులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ అందరికీ అని చెబుతూ.. ఇలా కొందరిదే అనేలా చేస్తున్న ఆ వ్యక్తుల గురించి బయటకు వస్తే సినిమాలు పడ్డ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus