సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటే హీరో నిఖిల్… రీసెంట్ చేసిన ఓ ట్వీట్ ఆయన మీదకు రివర్స్ అటాక్ అవుతోంది. అఫ్గానిస్థాన్‌లో ప్రజల పరిస్థితిని వివరిస్తూ… నిఖిల్ ఓ ట్వీట్ చేశారు. దాంతోపాటు అక్కడి ప్రజల దుస్థితిని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ పోస్టు చదివిన వారు, ఆ వీడియో చూసినవారు… అఫ్గానిస్థాన్ ప్రజల కష్టాల గురించి నిఖిల్ స్పందిస్తున్నారు అని కామెంట్లు చేశారు. అయితే ఇంకొంతమంది మాత్రం దేశ ప్రజల కష్టాల గురించి ట్వీట్లు వేయకుండా… అఫ్గానిస్థాన్ ప్రజలపై ఎందుకో అభిమానం అంటూ ఆడేసుకుంటున్నారు.
ఇది కాకుండా నిఖిల్ ట్వీట్‌పై మరో రకమైన కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఆ ట్వీట్‌లో అఫ్గానిస్థాన్ అమెరికా ఎలా ఇబ్బందులు పెట్టిందో వివరిస్తూనే… ఆఖరున అమెరికా అధ్యక్షుడు జో బైడన్ గురించి అభ్యంతరకరంగా రాసుకొచ్చారు. అచ్చంగా ఇలాంటి మాట అన్నందుకే ఓ కేంద్రమంత్రిని అరెస్టు చేశారు. నిఖిల్‌కు బైడెన్ మీద కోపం ఉంటే వేరే రకంగా అనాలి కానీ… అలా నేరుగా ఆ మాట అనడం సరికాదు అని నెటిజన్లు సూచిస్తున్నారు. మరి దీనిపై నిఖిల్ ఏమంటారో చూడాలి.
ఇంకొందరు అయితే బైడన్‌కు తెలుగు అర్థం కాదు కాబట్టి… నిఖిల్ ధైర్యంగా ఆ మాట అనేశారు. అయినా దేశ ప్రజల కష్టాలు గురించి, ఇక్కడి నాయకుల గురించి ఏమీ అనకుండా నిఖిల్ ఇలా ట్వీట్ చేయడం ఏంటో అనే కామెంట్లూ కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్ సామాజిక సమస్యలపై గతంలోనూ ఇలా స్పందించారు. తనదైన సాయం చేశారు కూడా. అయితే ఓ అధ్యక్షుడిని ఇలా అనడం ఎందుకో ఆయనకే తెలియాలి.