18 Pages Movie: నిఖిల్ సినిమాను ఇంకా చెక్కుతున్నారా..?

యంగ్ హీరో నిఖిల్ రెండేళ్ల క్రితం ’18 పేజెస్’ అనే సినిమాను మొదలుపెట్టారు. ‘కార్తికేయ2’ కంటే ముందే ఈ సినిమా విడుదల కావాల్సింది. ఈ ఏడాదిలో జూన్ లో రిలీజ్ కూడా చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లే డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిగాయి. కానీ సడెన్ గా ఈ సినిమాకి బ్రేక్ పడింది. ఆ తరువాత నిఖిల్ ‘కార్తికేయ2’ సినిమాపై దృష్టి పెట్టారు. ఆ సినిమా కూడా రిలీజ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

వేరే సినిమాలు పోటీ ఉండడంతో నిఖిల్ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. లేట్ గా రిలీజైనా.. సూపర్ హిట్ అయింది ‘కార్తికేయ2’. పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ఏకంగా రూ.100 కోట్ల మార్క్ ను అందుకుంది. దీంతో ఇప్పుడు నిఖిల్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. నార్త్ లో కూడా అతడికి గుర్తింపు రావడంతో తన తదుపరి సినిమాలను హిందీలో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిఖిల్.

ఇప్పుడు ’18 పేజెస్’ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. క్రిస్మస్ రేసులో సినిమాను దింపాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 23న సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టినట్లు వెల్లడించింది టీమ్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఇప్పుడు మళ్లీ షూటింగ్ ఏంటో..?. ఈ చిత్ర దర్శకుడు సూర్య ప్రతాప్.. సుకుమార్ కి శిష్యుడనే సంగతి తెలిసిందే.

సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత సూర్య ప్రతాప్.. సుకుమార్ కి సినిమా చూపించగా.. ఆయన కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేసి రీషూట్ చేయమని చెప్పారట. ‘కార్తికేయ2’ తరువాత నిఖిల్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఇప్పుడు ఎక్ట్రా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus