Karthikeya 2: వాయిదా అంటే రిజల్ట్ హిట్టేనా..?

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి సినీ జనాలు సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అవుతుంటారు. అయితే ఈ సెంటిమెంట్స్ లో కొన్ని పాజిటివ్ అయితే.. కొన్ని నెగెటివ్ ఉంటాయి. యంగ్ హీరో నిఖిల్ ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్ సెంటిమెంట్ గా మార్చుకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరువాత నిఖిల్ సినిమా వాయిదా పడితే అది హిట్ అవుతుందనేది అతడి సెంటిమెంట్.

అతడు నటించిన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’, ‘అర్జున్ సుర‌వ‌రం’ సినిమాల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైంది. ముఖ్యంగా ‘అర్జున్ సురవరం’ సినిమా చాలా సార్లు వాయిదా పడి.. ఫైనల్ గా రిలీజ్ అయిన తరువాత మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు నిఖిల్ కొత్త సినిమా ‘కార్తికేయ2’ కూడా పలు సార్లు వాయిదా పది ఆగస్టు 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. చిత్రబృందం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఇందులో నిఖిల్ కు ఈ వాయిదా సెంటిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి నిఖిల్ స్పందిస్తూ.. తనకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడికి కూడా ఇలా జరిగి ఉండదని.. తన సినిమాకి గండం వస్తే సక్సెస్ అవుతుందని.. సెలబ్రేట్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ సినిమా కూడా డిమానిటైజేషన్ తరువాత వచ్చిన మొదటి సినిమా అని.. ఆ సమయంలో చాలా భయపడ్డామని కానీ సినిమా పెద్ద హిట్ అయిందని గుర్తు చేసుకున్నారు.

ఇక ‘అర్జున్ సురవరం’ సినిమా కూడా చాలాసార్లు వాయిదా పడి చివరికి రిలీజై హిట్ అయిందని అన్నారు. ఆ తరువాత తన నుంచి మరో సినిమా రాకపోవడానికి కారణం కరోనా అని.. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చారు. మరి నిఖిల్ పాజిటివ్ సెంటిమెంట్ కి తగ్గట్లుగా ‘కార్తికేయ2’ కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి!

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus