నిను వీడని నీడను నేనే

  • July 12, 2019 / 04:12 PM IST

గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేని సందీప్ కిషన్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం హీరోగా నటించడమే కాక నిర్మాతగానూ వ్యవహరించిన చిత్రం “నిను వీడని నీడను నేనే”. పోస్టర్స్, టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా.. సినిమా మెయిన్ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈవారం రిలీజ్ లలో ఈ సినిమాకి ఇంపార్టెన్స్ పెరిగింది. మరి సినిమా ఆ హైప్ ను అందుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: భవిష్యత్ లో అనగా 2035 వ సంవత్సరంలో ఓ ప్రోబ్లం కు సొల్యూషన్ కోసం సైక్రియార్టిస్ట్ (మురళీశర్మ) వద్దకు వస్తారు. వారి సమస్య తీర్చే సమయంలో 2013 లో జరిగిన ఒక టిపికల్ ఇష్యుని వారితో పంచుకొంటాడు. అదేమిటంటే.. రిషి (సందీప్ కిషన్) మరియు అతడి సతీమణి దియా (అన్య సింగ్)లకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ అనంతరం అద్దంలో వేరే వాళ్ళ ప్రతిబింబాలు కనిపిస్తుంటాయి. రిషి అద్దంలో చూసుకొంటే అర్జున్ (వెన్నెల కిషోర్) కనిపిస్తే.. దియా అద్దంలో చూసుకుంటే మాధవి కనిపిస్తుంటుంది.

అసలు అలా ఎందుకు జరుగుతుంది? దాని వెనుక కారణం ఏమిటి? అనేది “నిను వీడని నీడను నేనే” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: సందీప్ కిషన్ నటన పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనోడు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో ఇంకాస్త స్టైలిష్ గా కనిపించాడు కూడా. కానీ.. క్యారెక్టర్ కి స్టార్టింగ్ లో ఉన్న బేస్ కానీ, డెప్త్ కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ఉండకపోవడంతో సినిమాతోపాటు సందీప్ కూడా బోర్ కొట్టేస్తాడు.

అన్య సింగ్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా ఉంది. ఆమె పాత్ర కంటే ఆమె చిలిపితనం, కళ్ళల్లో స్పార్క్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొంటుంది. లిప్ సింక్ కూడా బాగుంది. కామెడీ మాత్రం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు అమ్మడి ముఖంలో.

వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాంటివాడు. నటుడిగా వెన్నెల కిషోర్ ను గట్టిగానే వాడుకొన్నారు కానీ.. అతడి కామెడీ యాంగిల్ ను ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. పోసాని కృష్ణమురళి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. ఆయన అసలు ట్విస్ట్ ను రివీల్ చేసే విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కార్తీక్ రాజు రాసుకున్న కథలో నవ్యత ఉంది కానీ.. ఆ కథను డీల్ చేసిన విధానం మాత్రం సోసోగా ఉంది. ముఖ్యంగా కథలోని అసలు ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత కథనం మరీ నత్తనడకలా సాగింది. క్లైమాక్స్ వచ్చేసరికి వార్నీ ఇంతేనా అన్నట్లుగా ఉంటుంది సినిమా. సెకండాఫ్ మరియు కథనం విషయంలో కూడా కార్తీక్ జాగ్రత్త వహించి ఉంటే.. రిజల్ట్ మరోలా ఉండేది. సెకండాఫ్ లో కూడా కామెడీ ఉండాలి కాబట్టి పెట్టాం అనేట్లుగా ఉంటే కామెడీ సీన్స్ & ఎపిసోడ్స్ కథనాన్ని మరింత మందగింపజేశాయి కానీ.. ఉపయోగపడలేదు, కనీసం నవ్వించలేదు.

తమన్ బ్యాగ్రూమ్డ్ స్కోర్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. ప్రమోద్ సినిమాటోగ్రఫీ టెక్నీక్స్ కాస్త కొత్తగా ఉన్నాయి. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

విశ్లేషణ: తెలుగులో చాన్నాళ్ల తర్వాత హిట్ కొడదామన్న సందీప్ కిషన్ కల మళ్ళీ నీరు గారిందనే చెప్పాలి. కాకపొతే.. మరీ ఎక్కువ ట్విస్టులు ఎక్స్ పెక్ట్ చేయకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus