విశాల్ సినిమాతో సీనియర్ హీరోయిన్ రీఎంట్రీ!
- May 30, 2016 / 12:15 PM ISTByFilmy Focus
కనుమరుగయిపోయిన నిన్నటితరం హీరోయిన్లందరూ ఒక్కొక్కరిగా రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు. “మిర్చి” సినిమాతో నదియా, “కళ్యాణ వైభోగమే”తో రాశి. ఇలా మన పాత హీరోయిన్లందరూ సరికొత్తగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
తాజాగా ఈ జాబితాలో చేరిన సీనియర్ నటీమణి నీరోషా. తెలుగులో అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ వంటి కథానాయకుల సరసన నటించిన నీరోషా.. తమిళ నటుడు రామ్ కీ ని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. అప్పుడప్పుడూ తమిళ సినిమాల్లో మెరిసినప్పటికీ.. తెలుగులో మాత్రం మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమాలో కనిపించనుంది.
విశాల్-తమన్నా జంటగా సూరజ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ద్వారా నీరోషా రీఎంట్రీ ఇస్తోంది. జగపతిబాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. నీరోషా హీరో తల్లి పాత్ర పోషించనుందని తెలుస్తోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













