Nirosha, Rajinikanth: రజనీకాంత్ లాల్ సలాం సినిమాలో సీనియర్ నటి నిరోషా!

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరొక సీనియర్ నటి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. చాలాకాలం తర్వాత నటి నిరోషా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి నిరోష కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈమె రజినీకాంత్ నటిస్తున్నటువంటి లాల్ సలాం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రజినీకాంత్ నిరోషాకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విక్రాంత్,విశాల్ హీరోలుగా నటించగా రజనీకాంత్ మాత్రం ఒక ముస్లిం వ్యక్తి పాత్రలో నటిస్తూ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక రజనీకాంత్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నిరోషా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువడనుంది.

ఇలా చాలా కాలం తర్వాత నటి నిరోష ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరోషా స్వయాన సీనియర్ నటి రాధికకు సోదరీ అన్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా సమస్థ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus