తన బర్త్ డే రోజున భార్యకి కార్ గిఫ్ట్ గా ఇచ్చిన నిరుపమ్.. వీడియో వైరల్..!

  • August 28, 2021 / 12:02 PM IST

నిరుపమ్.. ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియక పోవచ్చు.. అదే డాక్టర్ బాబు అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ‘కార్తీక దీపం’ సీరియల్ ఇతన్ని ఫేమస్ చేసింది. బుల్లితెర పై ఇతనో సూపర్ స్టార్‌ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఇతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఇటీవల ఇతని భార్య మంజుల నిరుపమ్ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి వీడియోగా తన భర్త(నిరుపమ్) పుట్టినరోజు నాడు వాళ్ళ ఇరుగుపొరుగు వారిని తన ఇంటికి పిలిచి … నిరుపమ్ బర్త్ డే వేడుకలు నిర్వహించింది.

అలా తన భర్తని సర్ప్రైజ్ చేసింది.ఆగష్ట్ 17న నిరుపమ్ పుట్టినరోజు.అందుకు సంబంధించిన వీడియోని కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అయితే అదే రోజున నిరుపమ్ కూడా తన భార్య మంజులకి ఓ కార్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసాడు.నిరుపమ్ మాట్లాడుతూ.. “నా భార్య మంజులకు ఎప్పటి నుండో ఉన్న కోరికను తీర్చాలనిపించింది.తనకి కారు కావాలని నాకు ఎప్పుడో చెప్పింది. అందుకే ఓ ఫంక్షన్లో ఆమె ఉన్నప్పటికీ.. తనని మధ్యలోనే తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యాను.

అందుకే షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేసాను” అంటూ చెప్పుకొచ్చాడు.అనంతరం మంజులను పికప్ చేసుకున్న నిరుపమ్.. తనని కార్ షోరూమ్ కు తీసుకెళ్తే.. అతను పాత కార్ మారుస్తున్నాడేమో అనుకుంది ఆమె. కానీ చివరికి ‘ఆ కార్ నీకే’ అని అతను చెప్పడంతో ఆమె తబ్బిబ్బులైపోయింది.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus