Nisha Aggarwal: రీఎంట్రీపై కాజల్ చెల్లెలి రియాక్షన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో కరణ్ ని వివాహం చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ తరువాత బిడ్డ పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ కే ప్రాధాన్యతనిస్తోంది. అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఫిట్నెస్, ఫ్యాషన్ పై తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది.

తన ఫ్యామిలీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అందరికీ చూపించారు. కాజల్ తో దిగిన కొన్ని ఫోటోలను పంచుకొని ఆనందం వ్యక్తం చేసింది నిషా అగర్వాల్. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘మేడమ్‌ మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి’ అని అడిగాడు. దానికి నిషా.. ‘అది మాత్రం అడగకండి.. నేను ఇవ్వను.. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా మెసేజ్ చేయండి’ అని సమాధానమిచ్చింది. మరో నెటిజన్ ‘మీరు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా..?’ అని అడిగాడు.

దానికి నిషా.. ‘మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆమె రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా.. కథలు చెప్పే దర్శకులు ఉండాలి కదా. పైగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్లు చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో నిషాకి హీరోయిన్ గా అవకాశాలంటే కష్టమే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus