2018లో జనవరి 26న ‘భాగమతి’ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత అనుష్క నుండీ మరో చిత్రం రాలేదు. మధ్యలో మెగాస్టార్ 151 వ చిత్రమైన ‘సైరా నరసింహారెడ్డి’ లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా కనిపించి అలరించింది కానీ… అది గెస్ట్ రోల్ మాత్రమే. అంటే అనుష్క చిత్రం వచ్చి రెండేళ్లు దాటింది. ఇక ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రం ఇప్పటికే అనేక మార్లు విడుదల కావాల్సి ఉన్నా డిలే అవుతూ వచ్చింది.
నిజానికి ఏప్రిల్ 2 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. మరోపక్క లాక్ డౌన్ ఎత్తేసినా… థియేటర్ ఓపెన్ చేసినా… ఓ 3 నెలల వరకూ జనాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ‘నిశ్శబ్దం’ నిర్మాతలు అయిన కోన వెంకట్,విశ్వ ప్రసాద్ లు.. అయోమయంలో పడ్డారట. ఈ క్రమంలో అమెజాన్ వారు.. ‘నిశ్శబ్దం’ చిత్రానికి భారీ రేటు పెట్టి కొనుగోలు చెయ్యడానికి ముందుకు వచ్చారట.
ఎలాగూ చాలా సినిమాలను ఇలానే ఆన్లైన్ లోకి ఇచ్చేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. దీంతో ‘నిశ్శబ్దం’ నిర్మాతలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ఇచ్చేయడానికి రెడీ అయ్యి… అనుష్క కు కూడా విషయాన్ని తెలిపారట. అయితే ఇందుకు అనుష్క ఒప్పుకోవడం లేదట. లేట్ అయినా పర్వాలేదు థియేట్రికల్ ఇవ్వాల్సిందే అని పట్టుపడుతుందట.అసలే నెలకి 50 లక్షలు వడ్డీలు కడుతున్న నిర్మాతలు… అనుష్క పై అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!