Nithiin: చిరంజీవి కథ.. చిరంజీవికే చెప్పి.. నో అంటే నితిన్‌ ఓకే అన్నాడా?

‘రాబిన్‌ హుడ్‌’ (Chiranjeevi) అంటూ నితిన్‌ (Nithiin) ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు గుర్తుందా? వచ్చే నెలలోనే సినిమా విడుదలవుతుంది అని అంటున్నారు. త్వరలో డేట్‌ విషయంలో క్లారిటీ ఇస్తారు అనుకోండి. అయితే సినిమా కథ విషయంలో ముఖ్య సమాచారం ఇప్పటికే ఇచ్చేసినా.. తాజాగా ఓ పుకారు బయటకు వచ్చింది. దాంతో రెండు విషయాల్లో డౌట్స్‌ మొదలయ్యాయి. అలాగే ఓ క్లారిటీ కూడా వచ్చింది అని చెప్పొచ్చు. నాగ శౌర్యకు (Naga Shaurya) ‘ఛలో’ (Chalo) అంటూ మంచి విజయం అందించి..

Nithiin

నితిన్‌కు ‘భీష్మ’ (Bheeshma) అంటూ చక్కటి విజయం అందించిన వెంకీ కుడుముల (Venky Kudumula) వెంటనే చిరంజీవి సినిమా ఛాన్స్‌ సంపాదించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిపోయింది, కథ విషయంలో చర్చలు కూడా జరిగాయి. చాలా సిట్టింగ్స్‌ కూడా అయ్యాయి. అయితే ఏమైందో కానీ కథ ఓకే కాక ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. అప్పుడు వచ్చిన పుకార్లు.. ఇప్పుడు వస్తున్న పుకార్లను కలిపి చూస్తుంటే.. చిరంజీవికి (Chiranjeevi) వెంకీ కుడుముల చిరంజీవి పాత సినిమా కథనే చెప్పారు అని అంటున్నారు.

ఒకప్పటి హిట్ సినిమా ‘కొండవీటి దొంగ’ (Kondaveeti Donga) కథకు కాస్త హ్యూమర్‌ జోడించి నేటి తరం హంగులతో ఆ కథను సిద్ధం చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood)   లైన్‌ కూడా అలానే ఉంది అని అంటున్నారు. సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయడానికి త్వరలో ఓ టీజర్‌ను రెడీ చేస్తున్నారట. అది చూస్తే ‘కొండవీటి దొంగ’ సినిమా గుర్తొస్తుంది అని చెబుతున్నారు.

దీంతో గతంలో చిరంజీవికి వెంకీ కుడుమల చెప్పిన కథనే కాస్త మార్చి నితిన్‌కి చెప్పి ఓకే చేయించుకున్నారేమో అనే వాదన ఒకటి వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగి, సినిమా విజయం అందుకుంటే మంచి సినిమాను వదులుకున్నట్లే అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల గురించి చూస్తే తొలుత డిసెంబరు మూడో వారం అని అన్నారు. అయితే వివిధ కారణాల వల్ల నాలుగో వారంలో సినిమాను రిలీజ్‌ చేయాలని ఫిక్ష్‌ అయ్యారు అని చెబుతున్నారు.

ప్రభాస్‌ సినిమాపై ‘స్పిరిట్‌’ నిర్మాత కామెంట్స్‌.. ఆ ఇంగ్లిష్‌ సినిమాతో పోలుస్తూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus