క‌రోనా వ్యాప్తి నిరోధం కోసం హీరో నితిన్ రూ. 20 ల‌క్ష‌ల విరాళం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని హీరో నితిన్ నిర్ణ‌యించుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని నితిన్ ప్ర‌క‌టించారు. మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌నీ, అంద‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో పాలు పంచుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో కానీ, మ‌రేదైనా విప‌త్తుల స‌మ‌యంలో కానీ త‌క్ష‌ణం స్పందించి, త‌న వంతు సాయం చేయ‌డానికి ఎప్పుడూ ముందుండే నితిన్ ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అత్యంత విప‌త్క‌ర ప‌రిస్థితిని మ‌నో ధైర్యంతో ఎదుర్కోవాల‌నీ, అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌టించే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌నీ ప్ర‌జ‌ల‌ను కోరారు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus