ఇంటర్వ్యూ : ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ గురించి నితిన్ చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • December 5, 2023 / 08:12 PM IST

నితిన్, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్ల పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. డిసెంబర్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం :

ప్ర) ‘ఎక్స్ట్రా ఆర్డినరీ’ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?

నితిన్ : రెండున్నరేళ్ల క్రితం ఈ కథ వక్కంతం వంశీ గారు నాకు చెప్పారు. లాస్ట్ ఇయర్ నవంబర్ 2022 లో సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈ ఏడాది డిసెంబర్ కి కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే కొంత గ్యాప్ ఇచ్చారు.. స్క్రిప్ట్ నచ్చక గ్యాప్ ఇచ్చారా?

నితిన్ : నిజమే అందులో దాయడానికి ఏమీ లేదు. నా లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ బాగా ఆడలేదు. అందుకే ఈ మూవీ విషయంలో మొదటి నుండి జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో నేను ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. కానీ వక్కంతం వంశీగారే దీనిని బాగా డెవలప్ చేశారు. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ క్రెడిట్ ఆయనదే..!

ప్ర) మీరు ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు.. వాళ్ళ కష్టాలు కూడా ఇందులో చూపించే ప్రయత్నం చేశారా?

నితిన్ : ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు గురించి చూపించడం అనే పని పెట్టుకోలేదు. కేవలం ఫన్నీ వే..లో మాత్రమే చూపిస్తున్నాం. కష్టాలు వంటివి చూపిస్తే మన సినిమా ఎవ్వరూ చూడరు(నవ్వుతూ)

ప్ర) ‘ఎక్స్ట్రా’ లో ఇంటర్వెల్ బ్లాక్ లో ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు నిజమేనా?

నితిన్ : ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. సర్ప్రైజ్ చేస్తుంది. ఎక్సయిట్ చేస్తుంది. కథ పరంగా కొత్తదేమీ కాదు. కానీ హీరో రోల్ ను బాగా డిజైన్ చేశారు.

ప్ర) ట్రైలర్లో ‘మైసమ్మ’ అని ఎక్కువగా అరిచారు? దానికి రిలేటెడ్ గా కూడా ఏదైనా పాత్ర ఉంటుందా?

నితిన్ : కథ మొత్తం నడిపించేది మైసమ్మ పాత్రే. అది మీకు సినిమా చూస్తే అర్ధమవుతుంది.

ప్ర) ఇటీవల వచ్చిన ‘యానిమల్’ సినిమాలో ఫాథర్ సెంటిమెంట్ ఉంటుంది.. మీ సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందా?

నితిన్ : ‘యానిమల్’ సినిమాలో హీరోది ఫాదర్ ను భయపెట్టే రోల్. కానీ మా సినిమాలో ఫాదర్..ది హిలేరియస్ గా నవ్వించే రోల్. రెండిటికీ చాలా తేడా ఉంది.

ప్ర) ట్రైలర్లో కొన్ని డైలాగులు మీమ్స్ లోవి వాడినట్టు ఉన్నారు. అవి సినిమాలో మిస్ ఫైర్ అయ్యి ఎవర్నైనా హర్ట్ చేస్తాయని అనిపించలేదా?

నితిన్ : ఇందులో డైలాగ్స్ ఏమీ మిస్ ఫైర్ అవ్వవు. ఎందుకంటే అవి ఎవ్వరినీ హర్ట్ చేసే విధంగా ఉండవు. నవ్వుకుని వదిలేసే విధంగా ఉంటాయి. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో జనాభా కోట్లల్లో ఉంటే, సినిమాలు చూసేవాళ్ళు లక్షల్లోనే ఉంటారు. ఆ లక్షల్లో ఉన్నవాళ్లు మిగిలిన వాళ్లకి అర్ధమయ్యేలా చెబుతారు.. కాబట్టి రిస్క్ ఏమీ ఉండదు.(నవ్వుతూ)

ప్ర) సంపత్ రోల్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నారు?

నితిన్ : అవును..! ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఇందులో ఆయన పాత్ర. విలన్ గా కాకుండా, తండ్రి పాత్రలు కాకుండా.. ఇందులో కొత్తగా కనిపిస్తారు. రావు రమేష్ గారి పాత్ర కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పొచ్చు.

ప్ర) శ్రీలీల పాత్ర ఎలా ఉండబోతుంది?

నితిన్ : ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ రోల్ ఎలా ఉంటుందో.. ఇందులో శ్రీలీల రోల్ కూడా అలా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.. రాజశేఖర్ గారి పాత్ర అంటున్నారు.. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది?

నితిన్ : రాజశేఖర్ గారి రోల్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. చాలా ముఖ్యమైన పాత్ర అది. షూటింగ్లో కూడా ఆయన బాగా కోపరేట్ చేశారు. శివాని, శివాత్మిక కి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు కన్విన్స్ చేయడం వల్ల రాజశేఖర్ గారు మా ఈ సినిమాలో నటించడానికి చాలా ఈజీగా ఒప్పుకున్నారు.

ప్ర) నిర్మాత నాగ వంశీని కూడా ప్రమోషన్స్ లోకి బాగా లాగినట్టు ఉన్నారు?

నితిన్ : అతను నాకు చాలా మంచి ఫ్రెండ్. తర్వాత అతను కూడా ట్వీట్ వేసాడుగా..! ఈ మధ్యనే నేను ‘గుంటూరు కారం’ సెట్స్ కి కూడా వెళ్లాను. సాంగ్ షూట్ అవుతుంది. ఇంతకు మించి దాని గురించి చెబితే గురూజీ(త్రివిక్రమ్) నన్ను తిడతారు.

ప్ర) మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ గారు ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?

నితిన్ : ఆ ఐడియా మా నాన్నగారిది. ‘డేంజర్ పిల్లా’, ‘బ్రెషప్’ వంటి సాంగ్స్ కి చాలా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఆయన తెలుగు సినిమాలకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ‘ఆరెంజ్’ ‘సైనికుడు’ వంటి సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి.కానీ అవి సక్సెస్ కాలేదు. ఆయనకి ఈ సినిమా ఇక్కడ మంచి సక్సెస్ అందిస్తుంది అనే నమ్మకం ఉంది.

ప్ర) చాలా మంది హీరోలు వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. మీరు కూడా అలా చేసే అవకాశం ఉందా?

నితిన్ : తెలుగులో చేసినవే అక్కడి జనాలకి రీచ్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పటివరకు అయితే వేరే భాషల నుండి ఆఫర్స్ రాలేదు. అలాగే నాకు కూడా తెలుగులోనే మంచి పొజిషన్ కి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

నితిన్ : వెంకీ కుడుములతో చేస్తున్న మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, వేణు శ్రీరామ్ తో చేస్తున్న ‘తమ్ముడు’ కూడా సెట్స్ పైకి వెళ్ళింది. వీటితో పాటు ఇంకొన్ని కథలు వింటున్నాను.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus