నితిన్ కెరీర్ ఇప్పుడు బాగా స్లో అయ్యింది. వరుస ప్లాపులు అతన్ని వెనక్కి నెట్టాయి. ‘భీష్మ’ తర్వాత నితిన్ కు సరైన హిట్టు లేదు. ‘రంగ్ దే’ కొంచెం ఓకే. కానీ ‘చెక్’ ‘మాచర్ల నియోజకవర్గం’ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ‘రాబిన్ హుడ్’ ‘తమ్ముడు’ వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ప్లాపులు నితిన్ కి కొత్త కాదు. ఒక 8 ఏళ్ళ పాటు హిట్టు లేకపోయినా.. నిలదొక్కుకోగలిగాడు.
మార్కెట్ కూడా బాగానే ఉంది. కానీ వరుస ప్లాపుల వల్ల పారితోషికం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘తమ్ముడు’ కి అడ్వాన్స్ మినహా పారితోషికం ఏమీ అందుకోలేదు. ఇప్పుడు అదే బ్యానర్లో చేస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. దీనికి కూడా లాభాల్లో వాటా మాత్రమే తీసుకోగలడు. ‘ఎల్లమ్మ’ పై నితిన్ అయితే కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.
ఇది పక్కన పెట్టేస్తే… ‘ఎల్లమ్మ’ తర్వాత నితిన్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఇష్క్’ అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. నితిన్ ను ప్లాపుల నుండి బయటపడేసిన సినిమా అదే. విక్రమ్ కుమార్ సినిమా అంటే మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కథనం రెగ్యులర్ గా ఉండదు. స్క్రీన్ ప్లే చాలా మేజికల్ గా సాగుతుంది. ‘థాంక్యూ’ తో విక్రమ్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి ‘దూత’ వెబ్ సిరీస్ తో గట్టిగా సమాధానం చెప్పాడు విక్రమ్. సో నితిన్ తో చేస్తున్న సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇది హార్స్ రైడింగ్ నేపథ్యంలో సాగే సినిమా అని అంటున్నారు. ‘స్వారీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తయ్యిందట. అనూప్ రూబెన్స్ ని సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ‘యూవీ క్రియేషన్స్’ లేదా ‘ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.