తెలుగమ్మాయి కల్పిక గణేష్ అందరికీ సుపరిచితమే. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘యశోద’ వంటి సినిమాలతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు కొంచెం బొద్దుగా ఉండే ఈ అమ్మడు.. తర్వాత చాలా స్లిమ్ అయ్యింది. ఆ టైంలో ఈమె షేర్ చేసిన ఫోటోలు అన్నీ బాగా వైరల్ అయ్యేవి. మొన్నామధ్య నటుడు అభినవ్ గోమఠంతో కల్పిక వివాదం పెట్టుకున్న సంగతి తెలిసిందే.
అటు తర్వాత ఓ పబ్బులో చేసిన రచ్చ కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆ గొడవ ఇంకా సాల్వ్ అవ్వకుండానే ఇటీవల మళ్ళీ ఓ రిసార్ట్ కు చెందిన జనాలతో కూడా గొడవపడింది. అటు తర్వాత ఈమెపై పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యింది. అయితే ఆమెను అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ గొడవలు అలా ఉండగానే.. ‘కల్పికకి మెంటల్’ అంటూ ఆమె తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దుమారం రేపింది అని చెప్పాలి.
కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ ఈ విషయం పై స్పందిస్తూ.. “నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉంది.నా కూతురు వల్ల తనకు, అలాగే కుటుంబ సభ్యులకు, ప్రజలకు కూడా ప్రమాదం ఉంది. కొన్నాళ్ళ క్రితం ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. దీంతో రిహాబిలిటేషన్ సెంటర్ కు ఆమెను పంపించాము. తర్వాత మెడికేషన్ కు దూరమవ్వడంతో డిప్రెషన్‌లో ఉండి అందరితో గొడవలు పడటం, అల్లర్లు చేయడం వంటివి చేసింది. నా కూతురిని మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలని” పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు. సంఘవార్ గణేష్ ఫిర్యాదుతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది అనే చెప్పాలి. ఆయన కంప్లైంట్ తో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.