Nithiin: ఆ సినిమా ఆడకపోయినా అందులో నా పాత్ర అంటే ఇష్టం: నితిన్

  • December 3, 2023 / 11:50 AM IST

నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకుడు. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈరోజు ‘ఓలే ఓలే పాపాయి’ అనే మాస్ పాటని కూడా చిత్ర బృందం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నితిన్, శ్రీలీల పోటీపడి డాన్స్ చేసినట్టు విజువల్స్ ఉన్నాయి.

పనిలో పనిగా ఈరోజు మీడియా ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఇందులో భాగంగా నితిన్ కి, అలాగే దర్శకుడు వక్కంతం వంశీకి ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి అని చెప్పాలి. ఈ క్రమంలో నితిన్ కి.. ‘మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? ఒకవేళ మీరు మళ్ళీ రీమేక్ చేయాలి లేదా సీక్వెల్ చేయాలి అనుకుంటే ఏ సినిమాని రీమేక్/సీక్వెల్ చేస్తారు.?’ అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి (Nithiin) నితిన్ .. ‘ నేను నటించిన సినిమాల్లో ‘శ్రీ ఆంజనేయం’ సినిమా నాకు బాగా ఇష్టం. ఆంజనేయస్వామి దీక్షలో ఉన్నాను అని చెప్పడం లేదు. నిజంగా నాకు ఆ సినిమా అంటే ఇష్టం. కొన్ని ఫ్లాస్(లోపాలు) ఉండటం వల్ల ఆ సినిమా హిట్ అవ్వలేదేమో కానీ, అందులో నా క్యారెక్టరైజేషన్ నాకు బాగా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ ఉంటే ఆ క్యారెక్టర్ తో సీక్వెల్ లేదా రీమేక్ లాంటిది చేయాలని ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus