‘బలగం’ తో కల్ట్ బ్లాక్ బస్టర్ అందించిన వేణు ఎల్దిండి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాగా ‘ఎల్లమ్మ’ రాబోతున్నట్టు ప్రకటించి చాలా కాలం అయ్యింది. ‘బలగం’ సినిమా 2023 మార్చి లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు దాటింది. కానీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలో హీరో ఫిక్స్ అవ్వకపోవడం వల్లనే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మొదట నానితో ఈ ప్రాజెక్టు చేయాలని దిల్ రాజు ప్రయత్నించారు. కానీ నాని వరుస కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్టు చేయడానికి ముందుకు రాలేదు. అటు తర్వాత తేజ సజ్జని సంప్రదించారు దిల్ రాజు. కానీ తేజ సజ్జ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే తప్ప.. వేరే సినిమా చేసేలా కనిపించడం లేదు. ఫైనల్ గా నితిన్ ఫిక్స్ అన్నారు. కానీ నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది.
‘తమ్ముడు’ డిజాస్టర్ అవ్వడంతో నితిన్ తో ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాదని భావించి దిల్ రాజు.. అతన్ని తప్పించినట్టు తెలుస్తుంది.మళ్ళీ నానితోనే ఈ ప్రాజెక్టుని చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారంగానే మిగిలిపోయింది. మరోపక్క ‘ఎల్లమ్మ’ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యి 7 నెలలు దాటింది. చాలా మంది ఆర్టిస్టులను కూడా ఎంపిక చేసుకున్నారు.
ఒక సెట్ కూడా వేసినట్టు టాక్. సో వీటన్నిటినీ బట్టి చూస్తే.. సినిమాకి ఆ ఖర్చు చాలానే అవుతుంది.ఇదిలా ఉంటే.. ఫైనల్ గా ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరో ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంపికైనట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ దాదాపు శ్రీనివాస్ ఫిక్స్ అని అంటున్నారు.
అయితే రూ.70 కోట్ల బడ్జెట్ కి న్యాయం జరగదేమో అని భావించి నితిన్ ని తప్పించినప్పుడు… నితిన్ కంటే తక్కువ మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎలా న్యాయం జరుగుతుందని దిల్ రాజు ఫిక్స్ అయినట్లు? అధికారిక ప్రకటన కనుక వస్తే.. ఈ ప్రశ్నపై డిస్కషన్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది.