రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కాంతార’ తో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అతను డైరెక్ట్ చేసి, హీరోగా కూడా చేసిన ఈ సినిమా కన్నడలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు,హిందీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ట్రైలర్ తో అవి కొంచెం మందగించినట్లు కనిపించినా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
దసరా హాలిడేస్ కూడా ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్ కి బాగా కలిసొచ్చాయి అని చెప్పాలి. కానీ తర్వాత సినిమా కలెక్షన్స్ తగ్గాయి. స్టడీగా రాణిస్తుంది. కానీ.. టార్గెట్ చాలా పెద్దగా ఉండటంతో బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
ఇప్పుడు 2వ వీకెండ్ కలెక్షన్స్ పై అందరి దృష్టి పడింది. ఈ వీకెండ్ కలెక్షన్స్ తో సాధించిన రికవరీని బట్టే.. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనే ఓ క్లారిటీ అందరికీ వస్తుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 25.68 cr |
సీడెడ్ | 8.2 cr |
ఉత్తరాంధ్ర | 7.49 cr |
ఈస్ట్ | 3.15 cr |
వెస్ట్ | 2.29 cr |
గుంటూరు | 3.47 cr |
కృష్ణా | 3.54 cr |
నెల్లూరు | 1.70 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 55.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.28 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 56.8 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్) |
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) చిత్రం తెలుగు వెర్షన్ కి ఏకంగా రూ.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.86 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజుల్లో ‘కాంతార చాప్టర్ 1’ రూ.56.8 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.100.6 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.29.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం బాగానే కలెక్ట్ చేసింది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం వల్ల.. టార్గెట్ ఇంకా చాలా మిగిలుంది.