యువ హీరో హీరో నితిన్ (Nithiin) సినిమాలపై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా కొన్ని నిరాశలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాతో బిగ్ హిట్ అందుకోవాలని సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్లతో బజ్ పెంచడంలో విజయవంతమైంది.
దీంతో థియేట్రికల్ బిజినెస్ లోనూ నితిన్ కెరీర్‌లో హైయెస్ట్ రెస్పాన్స్ దక్కింది. ఇండస్ట్రీ ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, రాబిన్ హుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇది నితిన్ గత సినిమాలతో పోలిస్తే అత్యధిక మొత్తమే.
నితిన్ రీసెంట్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులు
రాబిన్ హుడ్ – 27.50 కోట్లు
ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్(Extra Ordinary Man) – 24.20 కోట్లు
మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) – 21.20 కోట్లు
రంగ్ దే (Rang De) – 23.90 కోట్లు
చెక్(Check) – 16 కోట్లు
భీష్మ (Bheeshma) – 21.80 కోట్లు
శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam) – 25.80 కోట్లు
భీష్మ సినిమా తప్పితే ఈ లిస్టులో ఏ సినిమా కూడా లాభాలు అందించలేదు. ఇక రాబిన్ హుడ్ పై చాలా హోప్స్ ఉన్నాయి. మతి ఈ సినిమా అనుకున్న టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి. ఇక డేవిడ్ వార్నర్ క్యామియో, శ్రీలీల (Sreeleela) గ్లామర్, జివి ప్రకాష్ (G. V. Prakash Kumar) మ్యూజిక్, వెంకీ కుడుముల (Venky Kudumula) కామెడీ.. ఇలా అన్ని ప్యాకేజ్ తరహాలో రూపొందిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ ఆసక్తి కనిపిస్తోంది.
సినిమా యూఏ సర్టిఫికెట్‌తో సెన్సార్ పూర్తి చేసుకుని, 2 గంటల 36 నిమిషాల రన్‌టైమ్‌తో బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు నితిన్ కెరీర్‌లోని టాప్ బిజినెస్ సినిమాల లిస్టులో ‘రాబిన్ హుడ్’ మొదటి స్థానంలో నిలవడం, అతని మార్కెట్‌ను మరోసారి స్థిరపరచబోతోందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి ఈ రాబిన్ బాక్సాఫీస్ హంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.