తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన జయం సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నితిన్ తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు యూత్ లో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆ సినిమా తరువాత నితిన్ నటించిన దిల్, సై సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు నితిన్ మార్కెట్ ను పెంచాయి. రేపు నితిన్ హీరోగా నటిస్తున్న చెక్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నితిన్ చెక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల చెక్ మూవీ ఆలస్యమైందని.. భీష్మ, చెక్ సినిమాలకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా భీష్మ సినిమా ముందు విడుదలైందని తెలిపారు. చెక్ మూవీలో తనకు క్లైమాక్స్ అంటే ఎంతో ఇష్టమని.. సినిమా అంతా జైలులోనే జరిగిందని అన్నారు. హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా చెక్ సినిమా అందరికీ నచ్చుతుందని నితిన్ వెల్లడించారు. ఖైదీ పాత్ర చేయడానికి తాను ప్రత్యేకంగా ఏం చేయలేదని నితిన్ అన్నారు.
సెట్ వెళ్లిన తర్వాత దర్శకుడు ఏం చెబితే అది చేయడమే తన పని.. గతంలో నటించిన సినిమాల షూటింగ్ సమయంలో సెట్లో తాను కామెడీ చేస్తూ సరదాగా ఉండేవాడినని ఈ మూవీలో మాత్రం ఖైదీ పాత్రలో నటిస్తున్నాను కాబట్టి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఖైదీలా ఉండిపోయానని నితిన్ తెలిపారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగుంటుందని.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నితిన్ చెప్పారు.
చెస్ ప్రియా వారియర్ కు తెలుగులో తొలి సినిమా అని.. తొలి సినిమా అయినా ఈ సినిమాలో నటించడానికి ఆమె ఎంతో కష్టపడిందని నితిన్ చెప్పారు. చిన్నప్పుడు చెస్ ఆడేవాడినని ఈ సినిమా వల్ల మళ్లీ చెస్ ఆడాల్సి వచ్చిందని ఈ ఏడాది తను నటించిన మూడు లేదా నాలుగు సినిమాలు విడుదలవుతాయని నితిన్ అన్నారు.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!