టాలీవుడ్ హీరో నితిన్ ను చూసి మనం కూడా చాలా నేర్చుకోవచ్చు. అపజయాలు ఎన్ని ఎదురైనా ఓ స్ట్రాంగ్ హిట్ ఇచ్చి వాటన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంటాడు. కుర్ర హీరో అయినా సొంతంగా సినిమాలు నిర్మించి హిట్లు అందుకున్న ట్రాక్ రికార్డు కూడా ఇతనికుంది. ఈయన సినిమా వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ఇప్పుడు ‘భీష్మ’ చిత్రంతో స్ట్రాంగ్ హిట్ ఇచ్చి వాటిని మర్చిపోయేలా చేయడానికి రెడీ అవుతున్నట్టు.. టీజర్, ట్రైలర్ లు చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితిన్ పాల్గొని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది మీకు బాగా స్పెషల్ అనుకుంట?
అవునండీ.. ఈ ఏడాది నావి 3 సినిమాలు వరకూ రిలీజ్ అవుతాయి. సినిమాలు ఎప్పుడూ ఉండేవే అనుకోండి. పెళ్లి చేసుకోబోతున్నాను కదా. అది మరింత స్పెషల్.
సాధారణంగా సెలబ్రిటీస్ లవ్ మ్యాటర్లు తొందరగా మీడియాకి లీక్ అవుతుంటాయి. కానీ మీ విషయంలో అలా జరగలేదు కదా?
చాలా ప్లాన్ చేసాము. అప్పుడే ఆ అమ్మాయిని మీడియాలో పాపులర్ చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ ఇయరే నా ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాను.
సో మీ మ్యారేజ్ ఎప్పుడుంటుంది?
ఏప్రిల్ 16న దుబాయిలో పెళ్లి ఉంటుంది. ఏప్రిల్ 21న ఇక్కడ రిసెప్షన్ అనుకుంటున్నాం.
‘భీష్మ’ విషయానికి వస్తే.. డైరెక్టర్ వెంకీ మీకు కథ ఎప్పుడు చెప్పాడు?
‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా టైములో నాకు కథ చెప్పాడు. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. కాబట్టి 1 ఇయర్ టైం పట్టింది.
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఓ ఫైట్ మీకు బాగా నచ్చింది అన్నారు. అది ‘అతడు’ ఇన్స్పిరేషన్ అని విన్నాం?
నిజమే.. ‘అతడు’ సినిమాలో ఫైట్ లానే ట్రై చెయ్యాలి అని ప్లాన్ చేసాము. చాలా బాగా వచ్చింది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎక్కువగా లవ్ స్టోరీస్ మాత్రమే చేస్తూ వస్తున్నారు. కొత్త కథలు ఏమైనా ట్రై చెయ్యాలి అనిపిస్తుందా?
నేను చేసేవి లవ్ స్టోరీలే అయినప్పటికీ.. కథలు డిఫరెంట్ గా ఉంటున్నాయి కథా. కానీ కొత్త సినిమాలు కూడా చేయడానికి నేనెప్పుడూ రెడీ. మధ్యలో ‘లై’ ట్రై చేశాను కానీ అది ఆడలేదు.
మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మొదట మీరు అభ్యంతరం చెప్పారట.. నిజమేనా?
కరెక్టే.. మొదట సేమ్ టీం ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ ను మారుద్దాం అని నేను వెంకీ(డైరెక్టర్) తో చెప్పాను. మొదట తమన్ ను పెడదాం అని అన్నాను. కానీ అతని బిజీ అయ్యేసరికి మహతి సాగర్ చేసాడు. మంచి పాటలిచ్చాడు. ‘సింగిలే’ పాట నాకు చాలా నచ్చింది.
మణిశర్మ గారితో అంతకముందు వర్క్ చేశారు.. కానీ హిట్ దక్కలేదు. ఈసారి వాళ్ళబ్బాయితో పనిచేస్తున్నారు. ఈసారి ఎలా అనిపిస్తుంది?
మణిశర్మ గారితో 4 సినిమాలు వర్క్ చేశాను. ఆయన నా సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. రెజల్ట్ మనచేతిలో ఉండదు. కానీ ఈసారి వాళ్ళబ్బాయితో మాత్రం పక్కా హిట్ పడుద్ది.
‘భీష్మ’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
మీమ్స్ క్రియేట్ చేసే కుర్రాడిలా కనిపిస్తాను. మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది నా పాత్ర. అందరినీ నవ్విస్తాడు.
పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ ఎక్కువ వాడుతున్నారు.. కేవలం ప్రమోషన్ కోసమేనా?
నేను ‘జయం’ సినిమా నుండీ పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ వాడుతున్నాను. అప్పుడు మీడియా అంత పాపులర్ అవ్వలేదు కాబట్టి చాలా మందికి తెలీదు. కానీ ‘ఇష్క్’ నుండీ సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నాకు పవన్ కళ్యాణ్ గారి పై ఉన్నది ప్యూర్ లవ్. అంతేకాని ప్రమోషన్ కోసం కాదు.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
మేర్లపాక గాంధీతో ‘అందాదున్’ రీమేక్ ఉంటుంది. జూన్ నుండి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాము. కృష్ణ చైతన్యతో ‘పవర్ పేట’ సినిమా కూడా ఆగష్టు నుండి స్టార్ట్ చేస్తాము. ఈ చిత్రం మల్టీ స్టారర్ లా ఉంటుంది. ఈ చిత్రంలో సత్యదేవ్ మరో హీరోగా కనిపించబోతున్నాడు. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్‌దే’, చంద్ర శేఖర్ యేలేటిగారితో ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాను.