Nithiin: నితిన్ అసలైన వేట.. డేట్ ఫిక్స్!

యువ హీరో నితిన్ గత కొంతకాలంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని నితిన్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా చేస్తున్న సినిమా.. మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాపై నితిన్ కు ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఎటాక్ టీజర్ ను నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

Click Here To Watch NOW

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ డిఫరెంట్ యాక్షన్ లో మోడ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఎటాక్ లో నితిన్ పులి వేషం వేసుకున్న విలన్స్ తో చేసిన ఫైట్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. చూస్తుంటే సినిమాలో మాస్ ఆడియేన్స్ చేత విజిల్స్ వేయించే అంశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నితిన్ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

ఎందుకంటే అతను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అవుతోంది. చివరగా వచ్చిన చెక్, రంగ్ దే సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. మాచర్ల నియోజకవర్గం సినిమాను నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో సుధాకర్ రెడ్డి నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎమ్ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాను జులై 8వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు.

పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు అభిమానులకు ఫస్ట్ ఎటాక్ తో మంచి ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది. నితిన్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇది శాంపిల్ మాత్రమే అంటూ అసలైన వేట జూలై 8 నుంచి థియేటర్లో..అని వివరణ ఇచ్చాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus