Robinhood: ‘పుష్ప’ వల్ల ‘రాబిన్ హుడ్’ రిలీజ్ డేట్లో మార్పు.. నిజమేనా?

నితిన్ (Nithiin)  హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ‘భీష్మ’ (Bheeshma) వంటి సూపర్ హిట్ తర్వాత ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల  (Sreeleela)  హీరోయిన్ గా నటిస్తుంది. నీరా వాసుదేవ్ అనే పాత్రలో శ్రీలీల కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. నితిన్ అయితే ఈ సినిమాలో ఓ మంచి దొంగ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ తోనే అసలు కథ మొదలవుతుందని..

ట్విస్టులు, కామెడీ హైలెట్ గా నిలుస్తాయని ఇన్సైడ్ టాక్. ఈ మధ్య కాలంలో నితిన్ చేసిన సినిమాలు నిరాశపరిచాయి. వెంకీ కుడుముల ఖాతాలో ‘ఛలో’ (Chalo) ‘భీష్మ’ వంటి హిట్లు పడినా.. కెరీర్లో గ్యాప్ వచ్చింది. చిరంజీవి (Chiranjeevi) సినిమా కోసం వెయిట్ చేయడం వల్లే ఈ గ్యాప్ పెరిగింది అనుకోవచ్చు. మరోపక్క శ్రీలీల సినిమాలు కూడా వరుసగా నిరాశపరిచాయి. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ కి కూడా మిడ్ రేంజ్ సినిమాలు నిరాశ పరుస్తూ వచ్చాయి.

సో వీరికి ‘రాబిన్ హుడ్’ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మరోపక్క ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 3వ వారంలో అంటే డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యే సినిమాలకి టాక్ ఓ మాదిరిగా వచ్చినా క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ బాగా కలిసొస్తాయి. అలా చూసుకుంటే ‘రాబిన్ హుడ్’ కి అది మంచి డేటే అని చెప్పాలి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం..

డిసెంబర్ 20 కంటే ముందుగానే ‘రాబిన్ హుడ్’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. దానికి కారణాలు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. డిసెంబర్ నెలలోనే ‘మైత్రి’ వారి ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule) కూడా రిలీజ్ అవుతుంది. బహుశా అందుకే ‘రాబిన్ హుడ్’ ని నవంబర్ చివర్లో లేదా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus