Nithin: నితిన్ ఫ్యామిలీ రాజకీయాల్లో సక్సెస్ అవుతుందా?

  • September 19, 2022 / 04:05 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ కు ఈ మధ్య కాలంలో టైమ్ అస్సలు బాలేదనే సంగతి తెలిసిందే. నితిన్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు. వరుస ఫ్లాపుల వల్ల నితిన్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ బీజేపీ నేత జేపీ నడ్డా నితిన్ ను కలిసిన సంగతి తెలిసిందే.

నితిన్ కుటుంబం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ఆ కారణం వల్లే జేపీ నడ్డా నితిన్ ను కలిశారని బోగట్టా. నితిన్ సోదరి నిఖితారెడ్డి లేదా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి నితిన్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. నితిన్ కుటుంబం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే రాజకీయాలలో సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

గత కొన్నేళ్లలో రాజకీయాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. నితిన్ భవిష్యత్తులో రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే నితిన్ కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

పేరున్న దర్శకులతో పని చేసిన ప్రతి సందర్భంలో నితిన్ కు సక్సెస్ దక్కిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నితిన్ రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ తగ్గుతోందని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై నితిన్ దృష్టి పెట్టాలని నెటిజన్లు భావిస్తుండటం గమనార్హం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus