నిత్యా మేనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయిందా?

ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. హీరో నిఖిల్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(రెండో పెళ్లి), కన్నడ హీరో నిఖిల్ కుమారస్వామి వంటి వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక నితిన్, రానా, నిహారిక వంటి వారు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు.అతి త్వరలోనే వీరి పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. మరో క్రేజీ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు.. నిత్యా మేనన్.ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే నిత్యా మేనన్.. తాజాగా పెళ్లి పై ఆమె ఉద్దేశాన్ని కూడా బయటపెట్టింది. ముందుగా ఈమెకు పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అస్సలు లేదట.. కానీ ఓ స్టార్ హీరో వల్ల కలిగిందని ఈమె చెప్పుకొచ్చింది. అలా అని ఆ స్టార్ హీరోని ఈమె ప్రేమించలేదట. ఈమె పెళ్లి చేసుకోవాలి అనే విధంగా అతను మోటివేట్ చేసాడని తెలిపింది. ఆ హీరో మరెవరో కాదు దుల్కర్ సల్మాన్.

‘దుల్కర్ మంచి ఫ్యామిలీ మ్యాన్.. పెళ్లి బంధం గురించి నాకు చెప్పి కన్విన్స్ చేసాడు. నా ఆలోచనల్లో మార్పుని తీసుకొచ్చాడు’ అంటూ నిత్యా మేనన్ చెప్పుకొచ్చింది. ‘బెంగళూర్ డేస్’, ‘ఓకే బంగారం’ (‘ఓకే కన్మని’) ‘100 డేస్ ఆఫ్ లవ్’ వంటి చిత్రాలతో నిత్యా మేనన్, దుల్కర్ లకు మంచి స్నేహం ఏర్పడింది. ఆ చనువుతోనే దుల్కర్.. ఈమెకు బ్రెయిన్ వాష్ చేసాడని తెలుస్తుంది. ఇక నిత్యా కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి.. బ్యాక్ గ్రౌండ్లో ఆమె కుటుంబ సభ్యులు మేచెస్ చూస్తున్నారని ఇండైరెక్ట్ గా ఈమె హింట్ ఇచ్చినట్టు సమాచారం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus