దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తుంది.. హీరోయిన్ గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.. అలా అని స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. ఎవరి గురించే ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా.. యెస్ .. నిత్యా మేనన్. ఈమె యాక్టింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్ షో జోలికి పోదు.. కనీసం సన్నగా కూడా ఉండదు. అయినప్పటికీ ఈమె క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అయితే నటిగా ఎంత గుర్తింపు తెచుకున్నప్పటికీ నేషనల్ అవార్డును మాత్రం సొంతం చేసుకోలేదు అని ఈమె అభిమానులు కాస్త నిరాశ చెందుతుంటారు.
ఆ విషయం గురించి నిత్యా మేనన్ నే అడిగితే.. “నటిగా నేను కూడా నేషనల్ అవార్డు దక్కించుకుంటే చాలా సంతోషమే. ప్రేక్షకులకు నచ్చిన మంచి సినిమాలో నేను కూడా భాగమై, అందులో నా నటనకు నేషనల్ అవార్డు వస్తే బాగుణ్ణు అని నేను కూడా కోరుకుంటాను. అలా అని నేషనల్ అవార్డు కోసం రొటీన్ సినిమాలు చెయ్యను. ఒకవేళ రొటీన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినా నాకు సంతృప్తిగా అనిపించదు. నాకు అన్ని విధాలుగా సంతృప్తి ఇచ్చే సినిమా అయితేనే చేస్తాను. అయినా… నా కెరీర్ ఇంకా అయిపోలేదు. చాలా కెరీర్ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకి నేషనల్ అవార్డు సాధిస్తాను అనే నమ్మకం నాకు ఉంది. నన్ను నేను ఎప్పుడూ ఓ కొత్త హీరోయిన్‌లానే భావిస్తాను. యాక్టర్‌గా ఇక చాలు అని అస్సలు అనుకోను. ‘మిషన్ మంగళ్’ తర్వాత వేరే హిందీ సినిమాకి కమిట్ అవ్వలేదు. అందుకు కారణం.. ‘నాకు నచ్చే కథ ఇంకా దొరకకపోవడమే” అంటూ చెప్పుకొచ్చింది నిత్యామేనన్.
ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?