Nithya Menen , Dhanush: మరోసారి ‘తిరు’ కాంబినేషన్‌.. అవార్డు కొట్టాక మళ్లీ కలసి నటిస్తూ…!

తనకు జాతీయ అవార్డు రావడానికి కారణమైన కాంబినేషన్‌లో మరోసారి నటించేందుకు సిద్ధమైంది అంటూ గత కొన్ని రోజులుగా నిత్య మీనన్‌ (Nithya Menen) వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమని తేలింది. ధనుష్‌ (Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిరిస్మున్న ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలోనే ఆమె నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సినిమాలో తన ఎంట్రీ గురించి నిత్య మీనన్‌ అనౌన్స్‌ చేసింది. ప్రతి పాత్రతో సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది నిత్య మీనన్‌. అలా ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.

Nithya Menen , Dhanush

‘తిరుచిట్రంబంళం’ అనే సినిమాకుగాను ఆమెకు ఆ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కిన సినిమా అది. అందులో ఆమె స్నేహితురాలిగా / ప్రియురాలిగా మెప్పించింది. ఇప్పుడు ధనుష్‌ కొత్త సినిమా ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం) సినిమాలోనూ నటిస్తోంది. ‘కొత్త ప్రకటన.. కొత్త ప్రయాణం… ‘ఇడ్లీ కడై’ అనే కామెంట్‌తో సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది నిత్య.

ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందట. ఓ గ్రామంలో ఓ కుటుంబం నడిపే చిన్న ఇడ్లీ కొట్టు నేపథ్యంలో కథ సాగుతుంది అని పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. సినిమా పేరు, నేపథ్యం బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ధనుష్‌, నిత్య (Nithya Menen) భార్యాభర్తలుగా కనిపించే అవకాశం ఉంది. నటనలో ఇద్దరికిద్దరూ ఒకటే. మరి ఈ పాత్రల్లో ఎలా మెప్పిస్తారో చూడాలి.

అన్నట్లు ‘ఇడ్లీ కడై’ అంటే ఇడ్లీ కొట్టు అనే తెలుగు పేరు అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా సమయానికి ఆ పేరు పెడతారో? లేక ‘ఇడ్లీ కడాయి’ అని మారుస్తారో వాళ్లకే తెలియాలి. ఎందుకంటే తెలుగుకు వచ్చేసరికి తమిళ పేరు పెట్టేసి మమ అనిపించుకోవడం ఎక్కువైంది కదా. అందులోనూ ధనుష్‌ గత చిత్రం ‘రాయన్‌’ విషయంలోనూ అదే జరిగింది. మరి ధనుష్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

రోయిన్లు X ఫ్లైట్లు.. ఏం జరుగుతోంది అసలు.. మరి హీరోలకు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus