బాలకృష్ణ పక్కన నటించడానికి నో చెప్పిన నిత్యా మీనన్!

అలా మొదలయింది.. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిత్యామీనన్ తన నటనతో అభిమాన తారగా మారిపోయింది. తనకు సూటయ్యే పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం నాని సమర్పణలో వస్తున్న “అ!” సినిమాలో కీలకరోల్ పోషించింది. అయితే నిత్యామీనన్ తాజాగా ఓ భారీ అవకాశాన్ని వదులుకుంది. మహా నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథను తేజ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య అయిన బసవతారకం పాత్ర కోసం నిత్యామీనన్ ని చిత్ర బృందం సంప్రదించింది. అయితే ఈ రోల్ చేయడానికి ఆమె నిరాకరించినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు.

నిత్యా మీనన్ ఇదివరకు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల బాలకృష్ణకి సరసన నటించడానికి నో చెప్పినట్టు సమాచారం. ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇందిరా గాంధీ పాత్రకు నదియాని తీసుకున్నారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ మధ్య ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్ అవుతాయని చిత్ర బృందం వెల్లడించింది. ప్రస్తుతం తేజ వెంకటేష్ తో వేటా నాదే ఆట నాదే అనే సినిమాని పట్టాలెక్కించి పనిలో ఉన్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus