Nithya Menon: అలా అని నేను ఎక్కడా చెప్పలేదు!

మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నిత్యమీనన్ ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె కెరియర్ మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో అందరిలాగే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. కోలీవుడ్ హీరో తన కోరిక తీర్చమంటూ తనని ఇబ్బందులకు గురి చేశారు అంటూ పెద్ద ఎత్తున నిత్యమీనన్ గురించి వార్త వైరల్ అయింది.

ఇలా నిత్యమీనన్ (Nithya Menon) కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొందని అందరూ భావించారు. అయితే తాజాగా ఈమె శ్రీమతి కుమారి అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన గురించి వస్తున్నటువంటి రూమర్లపై స్పందించారు.

ఓ మీడియా ప్రతినిధి గతంలో మీరు కోలీవుడ్ హీరో నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ కామెంట్ చేశారు ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానం చెబుతూ నేను ఎప్పుడూ ఎక్కడ తనని కోలీవుడ్ హీరో హింసిస్తున్నారు అంటూ చెప్పలేదనీ ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. తనని ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురచేయలేదని ఈమె తెలిపారు.

ఇలా ఒకానొక సమయంలో స్వయంగా నిత్యమీనన్ తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పారు. ఇప్పుడు మాత్రం తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పడంతో బహుశా హీరోకి ఏమైనా భయపడి ఇలా చెబుతున్నారా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి నిత్యమీనన్ గురించి వచ్చినటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది లేదనే తనకే తెలియాల్సి ఉండి. అయితే నిత్య మీనన్ ఈ రూమర్లపై స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus