సౌత్ హీరోయిన్లు నార్త్‌కు వెళ్లడం గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. గతంలో ఇలా వెళ్లిన హీరోయిన్లు సరైన విజయాలు అందుకోక వెనక్కి వచ్చేశారు. కానీ రీసెంట్ టైమ్స్‌లో మన హీరోయిన్లు అక్కడకు వెళ్తున్నారు. విజయాలు అనుకున్నంతగా రాకపోయినా ఇంకా అక్కడ కొనసాగుతున్నారు. అలా అలా విజయాల వైపు వెళ్తున్నారు. దీనికి ఓ ఉదాహరణ రష్మిక మందన (Rashmika Mandanna). ఆమెకు రీసెంట్‌గా ‘ఛావా’ (Chhaava) అనే విజయం అందుకుంది. ఇప్పుడు మరో హీరోయిన్ బాలీవుడ్‌కి వెళ్తోంది. ‘తిరు చిట్రంబళం’ (Thiruchitrambalam) సినిమాతో ఇటీవల ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న నిత్య మీనన్ (Nithya Menen).
ప్రస్తుతం ధనుష్‌తో (Dhanush) ‘ఇడ్లీ కడై’ (Idly Kadai) అనే సినిమాలో నటిస్తోంది. ధనుష్‌తో వరుస సినిమాలు చేస్తోందనేమో ఆమెకు కూడా బాలీవుడ్ ఆలోచన వచ్చినట్లుంది. ప్రముఖ హిందీ దర్శకుడు శేఖర్ కపూర్ తన హిట్ సినిమా ‘మసూమ్’ సినిమాకు సీక్వెల్‌గా ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోనే నిత్య మీనన్ నటిస్తోందట. ఆ పాత్ర హీరోయినా లేక ముఖ్య పాత్రనా అనేది తెలియదు కానీ.. హిందీలోకి అయితే నిత్య మీనన్ వెళ్లడం పక్కా అయిపోయింది.
ఈ సినమాలో మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) కూడా నటిస్తున్నారు. అలాగే 1983లో వచ్చిన తొలి ‘మసూమ్’లో నటించిన నసీరుద్దీన్ షా (Naseeruddin Shah), షబానా అజ్మీ (Shabana Azmi) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇక నిత్య ప్రస్తుత సినిమాల విషయం చూస్తే.. ధనుష్ ‘ఇడ్లీ కడై’తోపాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సినిమాలో నటిస్తోంది.
వీటితోపాటు ‘లయన్’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. తెలుగులో అయితే ఇప్పుడు కొత్త సినిమాలేవీ చేయడం లేదు. ఇప్పుడు బాలీవుడ్ వెళ్లాక సౌత్ సినిమాల చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే కాస్త నాజూకు హీరోయిన్లకే బాలీవుడ్ జనాలు ఓటేస్తుంటారు. ఇక తొలి ‘మసూమ్’ సంగతి చూస్తే గుల్జార్ రాసిన కథను శేఖర్‌కపూర్ తెరకెక్కించారు. ఆ రోజుల్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్.