ప్రభాస్ (Prabhas) – హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో ఫౌజీ అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్-డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్స్‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాత్రపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చినప్పటికీ, సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నపై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. ఇమాన్ ఇస్మాయిల్ అనే నూతన నటిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.
కానీ ఆమె ప్రభాస్‌కు పూర్తి స్థాయి జోడిగా నటిస్తున్నారా? లేదా కీలకమైన పాత్రలో కనిపించనున్నారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మరో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) , టాలీవుడ్ నేచురల్ స్టార్ సాయి పల్లవి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఆలియా భట్ యువరాణి పాత్రలో కనిపించే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి (Sai Pallavi) గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ (Padi Padi Leche Manasu) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఆ అనుభవం దృష్టిలో ఉంచుకొని, మరోసారి ఆమెను కథానాయికగా తీసుకునే ఆలోచన మేకర్స్‌లో ఉందని సమాచారం. అయితే, ఆలియా భట్ పేరు కూడా పరిశీలనలో ఉండటంతో, చివరకు ఎవరు ఈ రోల్‌ను పోషించబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
విజువల్ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ (The Raja saab) మరియు ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ రెండు సినిమాల విడుదలల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్-హను సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోందో తెలియాలంటే, మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసే వరకు ఎదురుచూడాల్సిందే.