‘జై లవకుశ’లో ఎన్టీయార్ సరసన ఒన్నాఫ్ ది హీరోయిన్ గా నటించి, మెయిన్ హీరోయిన్ అయిన రాశీఖన్నాను తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసిన నివేదా థామస్ ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకొని కొన్నాళ్లపాటు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసి.. సైలెంట్ గా సినిమాలకు ఓ మినీ గుడ్ బై చెప్పింది. ఎందుకు అని ఎవరైనా అడిగితే “నేను నా చదువు పూర్తి చేయాలి” అని సమాధానమిచ్చింది. మధ్యలో రామ్ చరణ్, శర్వానంద్ ల సినిమాల ఆఫర్లు లభించినప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరించింది.
అయితే.. కథ నచ్చిందో లేక మరింకేదైనా కారణం ఉందేమో తెలియదు కానీ ఉన్నట్లుండి ఒక కొత్త సినిమా సైన్ చేసింది నివేదా. అది కూడా యువ కథానాయకుడు నాగశౌర్య సరసన. కెమెరామెన్ సాయిశ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న చిత్రంలో నివేదాను ఫైనల్ చేశారట. రామ్ చరణ్, శర్వానంద్ లాంటి సక్సెస్ ఫుల్ హీరోలను వాదులుకొని నివేదా ఈ సినిమా ఎందుకు సైన్ చేసింది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. మరి కారణం ఏమిటో మనకు తెలియదు కానీ.. ప్రస్తుతం బార్బ్ హెయిర్ లుక్ తో బుజ్జిగా కనిపిస్తున్న నివేదా కొత్త లుక్ కూడా శౌర్య సినిమా కోసమేనని తెలుస్తోంది.