పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో నివేతా పాత్ర అదేనా ?
- December 19, 2016 / 11:50 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే తర్వాత చేయనున్న రెండు సినిమాల విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదట తమిళ దర్శకుడు నేసన్ కాంబినేషన్ మూవీకి పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, తర్వాత త్రివిక్రమ్ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ఒకే సమయంలో తెరకెక్కనున్నాయి. వీటిలో నటించనున్న హీరోయిన్లు కూడా ఫిక్స్ అయ్యారు.
తమిళ హీరో అజిత్ నటించిన ‘వేదాళం’ కు రీమేక్ గా వస్తున్న పవన్ మూవీలో హీరోయిన్ గా అఖిల్ చిత్ర భామ సాయెషా సైగల్ ఖరారు అయింది. మాతృకలో అజిత్ కి చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. తెలుగులో ఆ పాత్రను నివేతా థామస్ పోషించనున్నట్లు తెలిసింది. నేచురల్ స్టార్ నాని జెంటిల్ మ్యాన్ సినిమాలో చక్కగా నటించి తెలుగు వారికి దగ్గరైన ఈ కేరళ కుట్టి పవన్ కి చెల్లెలిగా కనిపించనుంది. ఈ వివరాలను అధికారికంగా నిర్మాత ఏఎం రత్నం త్వరలో వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















